'గణతంత్ర వేడుకల్లో శకటాల ప్రదర్శన ఉండదు' | Republic day parade at secunderabad | Sakshi
Sakshi News home page

'గణతంత్ర వేడుకల్లో శకటాల ప్రదర్శన ఉండదు'

Jan 8 2015 1:25 PM | Updated on Sep 2 2017 7:24 PM

భారత గణతంత్ర దినోత్సవ వేడుకలు సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్లో నిర్వహిస్తామని తెలంగాణ సమాచార శాఖ కమిషనర్ ఆర్ వీ చంద్రవదన్ గురువారం హైదరాబాద్లో వెల్లడించారు.

సికింద్రాబాద్: భారత గణతంత్ర వేడుకలు సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్లో నిర్వహిస్తామని తెలంగాణ సమాచార శాఖ కమిషనర్ ఆర్ వీ చంద్రవదన్ గురువారం హైదరాబాద్లో వెల్లడించారు. ఉదయం 10.30 గం. గవర్నర్ జాతీయ జెండా ఆవిష్కరిస్తారని తెలిపారు. సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్లో ఈ ఏడాది శకటాల ప్రదర్శన ఉండదని చెప్పారు.

గణతంత్ర వేడుకల్లో పాల్గొనేవారు పేపర్ జెండాలను మాత్రమే వాడాలని, ప్లాస్టిక్ జెండాలను వాడరాదని సూచించారు. చిన్నారులు ఇబ్బందులు పడని రీతిలో పరేడ్ గ్రౌండ్స్లో ఏర్పాట్లు చేస్తున్నట్లు చంద్రవదన్ పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement