తెలంగాణ అభివృద్ధి కోసమే అష్టకష్టాలు పడి రాష్ట్రాన్ని సాధించుకున్నామని జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం అన్నారు.
కొత్తూరు: తెలంగాణ అభివృద్ధి కోసమే అష్టకష్టాలు పడి రాష్ట్రాన్ని సాధించుకున్నామని జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం అన్నారు. అయితే, ఆంధ్రప్రదేశ్ పునర్‌వ్యవస్థీకరణ బిల్లు సక్రమంగా లేదని స్పష్టం చేశారు. గురువారం మహబూబ్‌నగర్ జిల్లా కొత్తూరులో జరిగిన గ్రంథాలయ వారోత్సవాల్లో ఆయన మాట్లాడారు.
బిల్లులో పొందుపరిచిన విధంగా ఆంధ్రా నుంచి తెలంగాణకు 53 శాతం విద్యుత్ రాకున్నా.. తెలంగాణ నుంచి ఆంధ్రాకు 43 శాతం మాత్రం వెళుతోందన్నారు. రాష్ట్రంలో విద్యుత్ ఆదా కోసం ఏసీల వాడకాన్ని తగ్గించి ఎల్‌ఈడీ బల్బులను వాడితే బాగుంటుందని, సోలార్ ప్యానెల్స్‌ను ఏర్పాటు చేసుకునేలా ప్రభుత్వం అవగాహన కల్పిస్తే ఉపయోగకరంగా ఉంటుందని అభిప్రాయపడ్డారు.