జమ్మికుంటలో ఇక నిత్యం జాతీయ గీతం ఆలాపన | Regularly sing the national anthem in Jammikunta | Sakshi
Sakshi News home page

జమ్మికుంటలో ఇక నిత్యం జాతీయ గీతం ఆలాపన

Aug 16 2017 1:31 AM | Updated on Sep 17 2017 5:33 PM

జమ్మికుంటలో ఇక నిత్యం జాతీయ గీతం ఆలాపన

జమ్మికుంటలో ఇక నిత్యం జాతీయ గీతం ఆలాపన

స్వాతంత్య్రదినోత్సవాన్ని పురస్కరించుకొని కరీంనగర్‌ జిల్లా జమ్మికుంట దేశంలో ఎక్కడా లేని విధంగా నూతన ఒరవడికి శ్రీకారం చుట్టారు.

ఆగస్టు 15 నుంచి మొదలు.. ఉదయం 8 గంటలకు షురూ
ఇక ఎక్కడివారు అక్కడే సెల్యూట్‌

జమ్మికుంట(హుజూరాబాద్‌): స్వాతంత్య్రదినోత్సవాన్ని పురస్కరించుకొని కరీంనగర్‌ జిల్లా జమ్మికుంట దేశంలో ఎక్కడా లేని విధంగా నూతన ఒరవడికి శ్రీకారం చుట్టారు. పంద్రాగస్టును పురస్కరించుకొని జమ్మికుంట ప్రజలంతా జాతీయ గీతాన్ని ఆలపిస్తారు. అలాగే, ఎక్కడి ప్రజలు అక్కడ సెల్యూట్‌ చేస్తారు.

పట్టణ సీఐ ప్రశాంత్‌రెడ్డి ఆలోచనల్లోంచి ఈ కొత్త ఒరవడిని మంగళవారం నాటి స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల నుంచి ప్రారంభించారు. ఇందులో భాగంగా జమ్మికుంటలో రోజూ ఉదయం 8 గంటలకు మొత్తం 11 చోట్ల ఏర్పాటు చేసిన మైకుల్లో ‘జనగణమణ’ వినిపిస్తారు. ఈ సమయంలో పట్టణ ప్రజలంతా ఎక్కడి వారు అక్కడే సెల్యూట్‌ చేస్తూ.. జాతీయ గీతాన్ని ఆలపించాల్సి ఉంటుంది. ఇలా రోజూ ప్రజలంతా జాతీయ గీతాన్ని ఆలపించి, సెల్యూట్‌ చేయడం దేశంలోనే తొలిసారిగా జమ్మికుంట వేదిక కానుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement