పట్టభద్రుల సీటుకు రామచంద్రరావు పేరు ఖరారు | ramachandra rao name for graduates constituency | Sakshi
Sakshi News home page

పట్టభద్రుల సీటుకు రామచంద్రరావు పేరు ఖరారు

Oct 18 2014 1:18 AM | Updated on Mar 28 2018 11:05 AM

పట్టభద్రుల సీటుకు రామచంద్రరావు పేరు ఖరారు - Sakshi

పట్టభద్రుల సీటుకు రామచంద్రరావు పేరు ఖరారు

పట్టభద్రుల నియోజకవర్గం నుంచి శాసనమండలికి నిర్వహించనున్న ఎన్నికల్లో అభ్యర్థిగా రాష్ట్రపార్టీ ప్రధాన అధికార ప్రతినిధి ఎన్.రామచంద్రరావు పేరును జాతీయ నాయకత్వానికి తెలంగాణ రాష్ట్ర బీజేపీ సిఫార్సు చేసింది.

సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్‌నగర్ జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గం నుంచి శాసనమండలికి నిర్వహించనున్న ఎన్నికల్లో అభ్యర్థిగా రాష్ట్రపార్టీ ప్రధాన అధికార ప్రతినిధి ఎన్.రామచంద్రరావు పేరును జాతీయ నాయకత్వానికి తెలంగాణ రాష్ట్ర బీజేపీ సిఫార్సు చేసింది. ప్రస్తుత ఎమ్మెల్సీ కె.నాగేశ్వర్ పదవీకాలం మార్చి చివర్లో ముగియనుండటంతో ఈ ఖాళీ ఏర్పడనుంది.

ఇక్కడి నుంచి పోటీ చేసేందుకు రామచంద్రరావుతోపాటు మాజీ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాసరెడ్డి, డా.మల్లారెడ్డి (రంగారెడ్డిజిల్లా) పోటీపడుతున్నారు. అయితే బీజేపీ రాష్ట్రఎన్నికలకమిటీ రామచంద్రరావు పేరును ఎంపికచేసి జాతీయనాయకత్వానికి సిఫార్సు చేసినట్లు సమాచారం. అతనికి కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు మద్దతుందని చెబుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement