వైభవంగా రక్షాబంధన్‌ | Raksha Bandhan Celebrations In Warangal | Sakshi
Sakshi News home page

వైభవంగా రక్షాబంధన్‌

Aug 27 2018 2:52 PM | Updated on Aug 30 2018 2:25 PM

Raksha Bandhan Celebrations In Warangal - Sakshi

నర్సంపేట పట్టణంలోని సంజీవని ఆశ్రమంలో రక్షాబంధన్‌ వేడుకలు

వరంగల్‌ : అన్నాచెల్లెళ్ల అనుబంధానికి ప్రతీకగా నిలిచే రక్షాబంధన్‌ వేడుకలను ఆదివారం జిల్లా వ్యాప్తంగా ఘనంగా జరుపుకున్నారు. పరకాల, వర్ధన్నపేట, నర్సంపేట నియోజకవర్గాల్లో ఉత్సవాలు అంబరాన్నంటాయి. ఈ సందర్భంగా ఆడపడుచులు తమ సోదరులకు రాఖీలు కట్టి, మిఠాయిలు తినిపించారు. బైక్‌లు నడిపేటప్పుడు ప్రమాదాల బారి నుంచి తప్పించుకోవడానికి పలు ప్రాంతాల్లో హెల్మెట్లను బహూకరించారు. సోదరులు తమకు తోచిన కట్నకానుకలను అందించారు. వృద్ధాశ్రమాలు, అనాథ బాలల ఆశ్రమాల్లో కూడా వేడుకలు వైభవంగా జరిగాయి. 

Advertisement
 
Advertisement
Advertisement