‘రైల్వే టూరిజం’ కొత్త యాత్రలు | Sakshi
Sakshi News home page

‘రైల్వే టూరిజం’ కొత్త యాత్రలు

Published Tue, Oct 14 2014 3:46 AM

‘రైల్వే టూరిజం’ కొత్త యాత్రలు

చంద్రశేఖర్‌కాలనీ : ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్(ఐఆర్‌సీటీసీ) ద్వారా ఈ సారి సరికొత్త తీర్థయాత్రల దర్శనీయ పుణ్యక్షేత్రాలతో కొత్త యాత్రలను ప్రారంభించిందని  కార్పొరేషన్ మేనేజర్ కె. అమ్మారావు తెలిపారు. జిల్లా కేంద్రంలోని రైల్వే స్టేషన్‌లో సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. పూరిజగన్నాథ ఆలయం, భువనేశ్వర్, లింగరాజ రాజధాని, పిప్లి, రఘురాజ్వాల్ ఆలయాలకు, కొనార్క్ లోని సూర్య దేవాలయం, చంద్రబాగ బీచ్, చిల్యా లేక్ ఒరిస్సా గోల్డెన్ త్రైయాంగ్ల్ ఆరు రాత్రులు, ఏడు పగలు దినాలలో సాగే ఈ ప్రయాణంలో స్లీపర్ తరగతి రైలు ప్రయాణం, భోజన సదుపాయం,పర్యాటక ప్రదేశాలలో నాన్ ఏసీ రోడ్డు ప్రయాణం,వసతి,గైడ్, ప్రయాణ బీచు సౌకర్యం కల్పించబడుతాయని వివరించారు.

రైలు నంబర్ 17016 విశాఖ ఎక్స్‌ప్రెస్ రైలులో ప్రత్యేక బోగిలో  న వంబర్ 28 న సాయంత్రం 5 గంటలకు సికింద్రాబాద్ నుంచి బయలుదేరి నల్గొండ,గుంటూరు, విజయవాడ, రాజమండ్రి మీదుగా భువనేశ్వర్‌కు చేరుతుందన్నారు. తిరిగి డిసెంబర్ 5 న సికింద్రాబాద్‌కు ఉదయం 7.30 గంటలకు చేరుకుంటామని, ఈ ప్రయాణం ఖర్చు ఒక్కొక్కరికి  రూ. 9,675 ఉంటుందని ఆయన తెలిపారు.  

పూరి జగన్నాథ్ ధాం, గోవా బీచ్ రైలు ప్రయాణ  యాత్రలకు 5 శాతం రాయితీ కూడా కల్పించి నట్లు చెప్పారు.  ప్రభుత్వ ఉద్యోగులు ఎల్‌టీ సీ సదుపాయాన్ని ఉపయోగించుకోవచ్చన్నా రు. 5 శాతం రాయితీ ఐఆర్‌సీటీసీ ఆఫీసులో బుక్ చేసుకొన్న వారికే వర్తిస్తుందన్నారు.  ఇంకా వివరాలకు డబ్ల్యుడబ్ల్యుడబ్ల్యు.ఐఆర్‌సిటిసిటూరిజం.కామ్, 040 277702407, 9701360701 నుంచి చివరగా మూడు అంకెల గల 647, 653, 697,698, 707,729 సెల్‌ఫోన్ నంబర్‌లకు, లేదా నిజామాబాద్‌లోని 08462-225539, 94405 02075 సెల్‌నంబర్‌కు సంప్రదించవచ్చని ఆయన సూచించారు.

Advertisement
Advertisement