ఇంటా బయటా స్వచ్ఛత పాటించాలి | Purity programs in or out | Sakshi
Sakshi News home page

ఇంటా బయటా స్వచ్ఛత పాటించాలి

Mar 12 2016 2:44 AM | Updated on Sep 27 2018 3:20 PM

ఇంటా బయటా స్వచ్ఛత పాటించాలి - Sakshi

ఇంటా బయటా స్వచ్ఛత పాటించాలి

జైనూర్ మండలంలోని పాఠశాలలను శుక్రవారం జాతీయ పరిశీలన అధికారులు ఆకస్మికంగా తనిఖీ చేశారు.

ఐఏఎస్ అధికారులు సునీల్‌కుమార్, అజిత్‌బి చౌహాన్, జిల్లా పరిశీలన
అధికారి గంగయ్య  జాతీయ పరిశీలకుల పర్యటన

 
 
జైనూర్:  జైనూర్ మండలంలోని పాఠశాలలను శుక్రవారం జాతీయ పరిశీలన అధికారులు ఆకస్మికంగా తనిఖీ చేశారు. మండలంలోని స్వచ్ఛపాఠశాలల నిర్వహణ తీరుతెన్నులు పరిశీలించడానికి  దబోలి గ్రామ పంచాయతీ పరిధిలోని లేండిగూడ, శేకుగూడ, దబోలి, కోలాం శాటిలైట్ పాఠశాలల మరుగుదొడ్డి, మూత్రశాల, పాఠశాల రికార్డుల నిర్వహణను పరిశీలించారు. అనంతరం పలు పాఠశాలల విద్యార్థులతో మాట్లడారు.  విద్యార్థులు ఇంటా బయటా స్వచ్ఛత పాటించాలని అన్నారు.

మరుగుదొడ్లు అందరూ మరుగుదొడ్లు వాడాలని సూచించారు. ఇంట్లో మరుగుదొడ్లు నిర్మించుకునేలా తల్లిదండ్రులకు అవగాహన కల్పించాలని విద్యార్థులకు వివరించారు. గ్రామంలో స్వచ్ఛత కార్యక్రమాలపై సర్పంచ్ రాధాబాయి, వైస్ ఎంపీపీ షేక్ రషీద్‌లతో మాట్లాడి తెలుసుకున్నారు. వీరి వెంట మోప్మా పీడీ రాజేశ్వర్, ఆర్వీఎం జీల్లా పరిశీలన అధికారి గంగయ్య, ఎంపీడీవో దత్తరావు, ఎంమ్మార్వో శంకర్ గౌడ్, ఎంఈవో భరత్, చౌహన్, హెచ్‌ఎంలు అత్మరావు, భీంరావు, సోము, ఖమ్ము, స్థానిక నాయకులు, పాఠశాల సిబ్బంది తదితరులున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement