ప్రైవేటు పాఠశాలల్లో అధికారుల తనిఖీలు | Private schools inspected by the authorities | Sakshi
Sakshi News home page

ప్రైవేటు పాఠశాలల్లో అధికారుల తనిఖీలు

Sep 20 2014 2:15 AM | Updated on Jul 26 2019 6:25 PM

ప్రైవేట్ పాఠశాలల నిర్వాహకుల్లో ఆందోళన మొదలైంది. ప్రభుత్వం పాఠశాలల్లో సౌకర్యాలపై తనిఖీలకు ఉపక్రమించడమే ఇందుకు ప్రధానకారణం.

నిజామాబాద్‌అర్బన్ : ప్రైవేట్ పాఠశాలల నిర్వాహకుల్లో ఆందోళన మొదలైంది. ప్రభుత్వం పాఠశాలల్లో సౌకర్యాలపై తనిఖీలకు ఉపక్రమించడమే ఇందుకు ప్రధానకారణం. జిల్లాలో మూడు రోజులుగా ప్రైవేటు పాఠశాలల్లో తనిఖీలు జరుగుతున్నాయి. ప్రైవేట్ పాఠశాలల్లో సౌకర్యాలు, విద్యాబోధన తీరును విద్యాశాఖ అధికారులు పరిశీలిస్తున్నారు. జిల్లాలో 850 ప్రైవేట్ పాఠశాలలు ఉన్నాయి. ఇందులో  410 పాఠశాలలకు అగ్నిమాపక శాఖ అనుమతి లేదు. సగం పాఠశాలలకు సానిటేషన్ సౌకర్యం లేదు. అలాగే ఆటస్థలాలు లేకుండానే పాఠశాలలను నిర్వహిస్తున్నారు. ఇలాంటి ముఖ్యమైన లోపాలున్న పాఠశాలలు యాజమాన్యాల పరిస్థితి కుడిలో పడ్డ ఎలుకల్లా మారింది. తనిఖీలకు వచ్చే అధికారులను ప్రలోభాలకు గురిచేసి తప్పిం చుకునే ప్రయత్నాలు చేస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. జిల్లాలోని 66 పాఠశాలలకు గుర్తింపు లేదు.

ఉన్న పాఠశాలల్లో  రెన్యూవల్ లేకుండా  మరి కొన్ని పాఠశాలలు కొనసాగుతున్నాయి. వీటిపై అధికారులు  కఠిన చర్యలు తీసుకోనున్నట్లు తెలి సింది. తనిఖీలను చేపడుతున్న అధికారులు ప్రతి రోజు నివేదికలను డీఈఓ శ్రీనివాసచారికి అం దిస్తున్నారు. ఈ నివేదికలను ప్రభుత్వానికి పంపిస్తున్నారు. అధికారుల తనిఖీల్లో పాఠశాలల్లో అదనపు సెక్షన్ల నిర్వహణ , మూత్రశాలల నిర్వహణ సక్రమంగా లేకపోవడం ప్రధానంగా వెలుగులోకి వస్తున్నాయి. వీటిపై కూడా అధికారులు పరిశీలన చేయనున్నారు. 80 శాతం పైగా ప్రైవేట్ పాఠశాలల్లో అసౌకర్యాలే ఉన్నట్లు అధికారుల పరిశీలనలో తేలుతోంది. వేలాది ఫీజులు వసూలు చేస్తున్నా సౌకర్యాల ఏర్పాటులో యజమాన్యాల నిర్ల క్ష్య వైఖరి బట్టబయలవుతోంది.
 
కొనసాగుతున్న దాడులు
 
నాలుగవ రోజు శుక్రవారం జిల్లా వ్యా ప్తంగా ప్రైవేట్ పాఠశాలల్లో తనిఖీలు జరి గాయి. ఒక్కరోజే 56 పాఠశాలలను తనిఖీ చేసినట్లు తెలిసింది. ఆయా మండల కేంద్రాల్లో నియమించిన ప్రత్యేక బృందాలు పాఠశాలలకు వెళ్లి తనిఖీలు చేశాయి. చాలా చోట్ల సక్రమమైన భవనాలు లేకపోవడం , శిక్షణ పొందిన ఉపాధ్యాయులు లేరని తేలింది.తనిఖీల్లో భాగంగా పాఠశాల ఆర్జేడీ మస్తానయ్యా నేడు జిల్లాకు రానున్నారు.పాఠశాలల్లో మౌలిక వసతులు, అనుమతులను పరిశీలించనున్నారు.
 
సరైన సమాచారం ఇవ్వాలి - డీఈవో శ్రీనివాసచారి
 
ప్రైవేట్ పాఠశాలలకు తనిఖీలకు వెళ్లిన అధికారులకు పాఠశాల యజమాన్యాలు సరైన సమాచారం ఇవ్వాలి, తప్పుడు సమాచారం ఇవ్వకూడదు. తప్పుడు సమాచారం ఇస్తే కఠిన చర్యలు తీసుకుంటాము. విద్యార్థుల కు మెరుగైన విద్యనందించేందుకు ఈ పరి శీలన కొనసాగుతోంది. అన్ని ప్రైవేట్ పాఠశాలల యజమాన్యాలు తనిఖీల బృందాలకు సహకరించాలి.
 
విద్యాహక్కు చట్టం అమలుకు కృషి -జిల్లా పరిశీలకులు రాంచందర్

బాన్సువాడ టౌన్ : తెలంగాణ రాష్ట్రంలో విద్యాహక్కు చట్టం అమలుకు కృషి చేస్తున్నామని, విద్యా ప్రమాణాలు విద్యార్థులకు పూర్తి సాయిలో అందించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు విద్యాశాఖ జిల్లా పరిశీలకులు రాంచందర్ అన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో ప్రైవేటు పాఠశాలలపై దృష్టి సారించలేకపోయామన్నారు. ఉపాధ్యాయులు స్వయం అధ్యయనంతోనే విద్యార్థులను తీర్చిదిద్దాలన్నారు.  శుక్రవారం బాన్సువాడ పట్టణంలోని సింధు, వివేకానంద పాఠశాలలను ఆయన తనిఖీ చేశారు.

ఆయన ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడారు. విద్యాశాఖ కమిషనర్ ఆదేశాల  మేరకు ప్రైవేటు పాఠశాలలను సందర్శించి నూతన పాఠ్యాంశాలపై విద్యార్థుల అభిప్రాయాలు, తరగతి గదుల పరిశీలన, మౌలిక వసతులు, ప్రైవేటు పాఠశాలల్లో బోధించే ఉపాధ్యాయుల విద్యార్హతలపై వివరాలు సేకరిస్తున్నామని తెలిపారు. ప్రైవేటు పాఠశాలల్లో ఉపాధ్యాయులు ఏవిధం గా బోధిస్తున్నారు, వారి విద్యార్హతలు ఏ మేరకు పాటిస్తున్నారు, అనే అంశాలపై వివరాలు సేకరించి ప్రభుత్వానికి నివేదికలు పంపిస్తామని అన్నారు. తన తనిఖీలో రెండు పాఠశాలల్లో గ్రంథాలయాలు, ల్యాబ్‌లు లేవని తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement