‘ఖరీఫ్‌’ మార్కెటింగ్‌కు సిద్ధం | Prepare for 'kharif' marketing | Sakshi
Sakshi News home page

‘ఖరీఫ్‌’ మార్కెటింగ్‌కు సిద్ధం

Aug 23 2017 1:30 AM | Updated on Sep 17 2017 5:51 PM

‘ఖరీఫ్‌’ మార్కెటింగ్‌కు సిద్ధం

‘ఖరీఫ్‌’ మార్కెటింగ్‌కు సిద్ధం

రాష్ట్రంలో పత్తి సాగు పెరుగుతున్న నేపథ్యంలో ఖరీఫ్‌ దిగుబడి సేకరణ, కొనుగోలుకు మార్కెటింగ్‌ యంత్రాం గం సిద్ధంగా ఉండాలని అధికారులను మంత్రి హరీశ్‌రావు ఆదేశించారు.

► అధికారులతో మార్కెటింగ్‌ శాఖ మంత్రి హరీశ్‌రావు సమీక్ష
► ఈ–నామ్‌ సాఫ్ట్‌వేర్‌ సమస్యలు కేంద్ర ప్రభుత్వం దృష్టికి
► జాతీయ ప్రమాణాలతో కోహెడ, పటాన్‌చెరు మార్కెట్లు


సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో పత్తి సాగు పెరుగుతున్న నేపథ్యంలో ఖరీఫ్‌ దిగుబడి సేకరణ, కొనుగోలుకు మార్కెటింగ్‌ యంత్రాం గం సిద్ధంగా ఉండాలని అధికారులను మంత్రి హరీశ్‌రావు ఆదేశించారు. ఖరీఫ్‌ దిగుబడుల సేకరణ, ఈ–నామ్, కోల్డ్‌ స్టోరేజీలు తదితర అంశాలపై మంగళవారం ఆయన సమీక్షిం చారు. ఈసారి పత్తి దిగుబడి పెరిగే అంచనాలు ఉన్నందున వాటి కొనుగోలు కేంద్రాల ఏర్పాట్లపై సిద్ధంగా ఉండాలన్నారు. ఇప్పటికే తెలంగాణలో 44 వ్యవసాయ మార్కెట్లలో ఈ–నామ్‌ విజయవంతంగా అమలవుతోం దని, అయితే సాఫ్ట్‌వేర్‌ సమస్యలు తరచూ తలెత్తుతున్నందున వెంటనే కేంద్రం దృష్టికి తీసుకువెళ్లాలని ఆదేశించారు.

నాబార్డు నిధులు సమీకరించి 9 కోల్డ్‌ స్టోరేజీల నిర్మాణం త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు. రాష్ట్ర సివిల్‌ సప్లైస్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌ పెద్ది సుదర్శన్‌ రెడ్డి ఆధ్వర్యంలో దడవాయిల సంఘం ప్రతినిధులు హరీశ్‌ను కలసి వినతిపత్రం సమర్పించిన నేపథ్యంలో.. వ్యవసాయ మార్కెట్లలో దడవాయిల లైసెన్సు బదిలీ దరఖాస్తులను 15 రోజుల్లో క్లియర్‌ చేయాలని ఆదేశించారు. ఇతర రాష్ట్రాల్లో దడ వాయిల సౌకర్యాలపై అధ్యయనం చేయాలని అధికారులకు సూచించారు. కోహెడ, పటాన్‌చెరులలో తలపెట్టిన మార్కెట్లను అత్యంత ఆధునికంగా జాతీయస్థాయి ప్రమాణాలతో నిర్మించాలని ఆదేశించారు.

కోహెడ మార్కెట్ల నిర్మాణానికి సంబంధించి వీటితో ముడిపడిన బిల్డర్లు, బ్యాంకర్లు, ట్రేడర్లు, రైతులు అందరితోనూ విస్తృతంగా చర్చలు జరపాలని సూచించారు. ఆయా వర్గాలకు కావలసిన వసతులు కల్పించాలని ఆదేశించారు. ఈ రెండు మార్కెట్ల నిర్మాణంపై సమగ్ర నివేదికను 15 రోజుల్లో సమర్పించాలని ఆదేశించారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో పెండింగులో ఉన్న నిమ్మ, దొండ, బత్తాయి మార్కెట్ల నిర్మాణాన్ని 45 రోజుల్లో పూర్తి చేయాలని ఆదేశించారు. గడువు లోపు పూర్తి చేయకపోతే సంబంధిత అధికారులపై చర్యలు తప్పవని హెచ్చరించారు. మార్కెటింగ్‌ డైరెక్టర్‌ లక్ష్మీబాయి, జేడీ లక్ష్మణుడు, పి.రవికుమార్, డిప్యూటీ డైరెక్టర్‌ మల్లేశం, ఓఎస్డీ జనార్దన్‌రావు తదితరులు సమావేశంలో పాల్గొన్నారు.

పత్తి రైతులకు గుర్తింపు కార్డులు పార్థసారథి
సాక్షి, హైదరాబాద్‌: దళారుల ప్రమేయాన్ని నిలువరించేందుకు గతేడాది పత్తి రైతులకు 25 లక్షల గుర్తింపు కార్డులు ఇచ్చామని, ఈ సారి కూడా బార్‌కోడెడ్‌ కార్డులు అంద జేయాలని నిర్ణయించినట్లు వ్యవసాయ శాఖ కార్యదర్శి సి.పార్థసారథి వెల్లడిం చారు. పత్తి రైతుల వివరాలు నమోదు చేయాలని జిల్లా అధికారులను ఆదేశించా రు. మంగళవారం ఈ మేరకు జిల్లా వ్యవసాయ, మార్కెటింగ్‌ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు.

వ్యవ సాయ వర్సిటీ, మార్కెటింగ్‌ శాఖ సంయుక్తంగా పత్తి కనీస మద్దతు ధర స్థిరీకరణకు నిర్వహిస్తున్న ప్రాజెక్టు అంచ నాలు, సూచనలు సెప్టెంబర్‌ నెలాఖరు కల్లా వెల్లడయ్యే అవకాశముందని తెలిపా రు. పత్తి కొనుగోలు కోసం 150 సీసీఐ కేంద్రాలు కావాలని కోరగా, కేంద్రం సాను కూలంగా స్పందించిందన్నారు. దాదాపు 130కేంద్రాలు వచ్చే సూచనలు ఉన్నాయని తెలిపారు. పత్తి పంటకు గులాబీ రంగు పురుగు, యాజమాన్యంపై చర్యలు తీసుకో వాలని కోరారు. మార్కెటింగ్‌శాఖ డైరెక్టర్‌ మార్కెటింగ్‌ లక్ష్మీబాయి పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement