10 నుంచి 22వరకు బీపీపీఎల్‌ | Premier League cricket tournaments of the Bhuvanagiri Parliament | Sakshi
Sakshi News home page

10 నుంచి 22వరకు బీపీపీఎల్‌

Feb 2 2019 2:50 AM | Updated on Feb 2 2019 2:50 AM

Premier League cricket tournaments of the Bhuvanagiri Parliament - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఫిబ్రవరి 10 నుంచి 22 వరకు ఐపీఎల్‌ తరహాలో అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో భువనగిరి పార్లమెంట్‌ ప్రీమియర్‌ లీగ్‌ (బీపీపీఎల్‌) 20–20 క్రికెట్‌ పోటీలు నిర్వహిస్తున్నట్లు టీపీసీసీ కోశాధికారి గూడూరు నారాయణరెడ్డి తెలిపారు. శుక్రవారం గాంధీభవన్‌లో బీపీపీఎల్‌ పోస్టర్‌ను ఆవి ష్కరించిన అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. గ్రామీణ ప్రాంతాల్లో ప్రతిభ గల క్రికెటర్ల నైపుణ్యాన్ని వెలికితీయడం కోసం బీపీపీఎల్‌ నిర్వహిస్తున్నామని చెప్పారు.

భువనగిరి పార్లమెంటు పరిధిలోని 7 నియోజకవర్గాలకు చెందిన మునుగోడు సూపర్‌ కింగ్స్, జనగామ చాలెంజర్స్, ఆలేరు సన్‌రైజర్స్, భువనగిరి లయన్స్, యాదగిరిగుట్ట రాయల్స్, నకిరేకల్‌ వారియర్స్, ఇబ్రహీంపట్నం రైడర్స్‌ అనే ఎనిమిది టీమ్‌లతో ఈ పోటీలు నిర్వహించనున్నట్లు చెప్పారు. మాజీ క్రికెటర్‌ అజారుద్దీన్‌ పర్యవేక్షణలో ఈ పోటీలు జరుగుతాయని, లీగ్‌ విజేతకు రూ. 1.50 లక్షలు, రన్నరప్‌కు రూ.లక్ష, మూడు, నాలుగు స్థానాల్లో నిలిచిన జట్లకు రూ. 50 వేల బహుమతిని అందిస్తామని తెలిపారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement