త్వరలో ‘విద్యుత్‌’ పీఆర్సీ!

Power companies seeking government approval for the formation of the committee - Sakshi

కమిటీ ఏర్పాటుకు ప్రభుత్వ అనుమతి కోరిన విద్యుత్‌ సంస్థలు

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్ర విద్యుత్‌ ఉద్యోగుల కొత్త వేతన సవరణ కమిటీ (పీఆర్సీ) ఏర్పాటు కు అనుమతివ్వాలని ప్రభుత్వాన్ని విద్యుత్‌ సంస్థల యాజమాన్యాలు కోరాయి. సర్కారు అనుమతి లభిస్తే త్వరలోనే కమిటీ ఏర్పాటు చేస్తామని వెల్లడించాయి. విద్యుత్‌ ఉద్యోగుల ప్రస్తుత పీఆర్సీ కాలపరిమితి వచ్చే ఏడాది మార్చితో ముగియనుండటంతో కొత్త కమిటీని ఏర్పాటు చేయాలని విద్యుత్‌ సంస్థల యాజమా న్యాలకు విద్యుత్‌ ఉద్యోగులు, కార్మిక సంఘాలు ఇటీవల విన్నవించాయి. ఈ నేప థ్యంలోనే కమిటీ ఏర్పాటుకు అనుమతివ్వాలని ప్రభుత్వా నికి యాజమాన్యాలు విన్నవించాయి. చివరి సారిగా 2014 మే నెలలో విద్యుత్‌ ఉద్యోగులకు 28 శాతం ఫిట్‌మెంట్‌తో వేతన సవరణ చేశారు. దీంతో విద్యుత్‌ సంస్థలపై నెలకు రూ.45 కోట్ల చొప్పున ఏడాదికి రూ.540 కోట్ల వరకు భారం పడింది. 2000 నుంచి ప్రతీ పీఆర్సీలో 20 శాతా నికి మించి ఫిట్‌మెంట్‌ వర్తింపజేశారని, ఈసారీ అదే ట్రెండ్‌ కొనసాగే అవకాశముందని అధికా రులు చెప్పారు. ఉద్యోగ, కార్మిక సంఘాలతో కొత్త వేతన సవరణ కమిటీ సమావేశమై ఫిట్‌మెంట్‌పై నిర్ణయం తీసుకుంటుందన్నారు.

మూడేళ్లకోసారి సవరణ..
జెన్‌కో, ట్రాన్స్‌కో, దక్షిణ తెలంగాణ విద్యుత్‌ పంపిణీ సంస్థ (టీఎస్‌ఎస్పీడీసీఎల్‌), ఉత్తర తెలంగాణ విద్యుత్‌ పంపిణీ సంస్థ (టీఎస్‌ ఎన్పీడీసీఎల్‌)లలో సుమారు 20 వేల మంది ఉద్యోగులు పని చేస్తున్నారు. వీరికి మూడేళ్లకో సారి కొత్త ఆర్సీని ప్రభుత్వం అమలు చేస్తోంది. వేతన సవరణకు ఉమ్మడి వేతన సవరణ కమిటీని విద్యుత్‌ సంస్థల యాజమాన్యాలు ఏర్పాటు చేస్తాయి. ఒక్కో విద్యుత్‌ సంస్థ నుంచి ఇద్దరు చొప్పున అధికారులు ఈ కమిటీలో సభ్యులుగా ఉంటారు. కొత్త పీఆర్సీ ఫిట్‌మెంట్‌ను ఖరారు చేసే సమయంలో విద్యుత్‌ సంస్థల ఆర్థిక పరిస్థితి, ఆర్థిక వనరులు, అదనపు భారం దృష్టిలో పెట్టుకుని నిర్ణయం తీసుకోనున్నారు. 

అలవెన్సులపైనా కమిటీలు
విద్యుత్‌ సంస్థల ఉద్యోగులకు అలవెన్సుల చెల్లింపులపైనా ఆ సంస్థల యాజమాన్యాలు త్వరలో కమిటీలు ఏర్పాటు చేయనున్నాయి. విద్యుత్‌ ఉద్యోగుల పీఆర్సీ కమిటీ తర్వాత వీటిని ఏర్పాటు చేయనున్నారు. జెన్‌కోలో పనిచేస్తున్న కోల్‌ ప్లాంట్, యాష్‌ ప్లాంట్, హాట్‌లైన్‌ వర్కర్లకు చెల్లించే ప్రత్యేక అలవెన్సులు, విద్యుత్‌ ఉద్యోగుల ట్రాన్స్‌పోర్టు, కన్వీనియన్స్‌ తదితర అలవెన్సులపై కమిటీలు నిర్ణయం తీసుకోనున్నాయి.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top