'జగదీశ్ రెడ్డి అవినీతిపై విచారణ చేపట్టాలి' | ponnam slams on jagadeesh reddy | Sakshi
Sakshi News home page

'జగదీశ్ రెడ్డి అవినీతిపై విచారణ చేపట్టాలి'

Feb 24 2015 2:38 PM | Updated on Sep 2 2017 9:51 PM

తెలంగాణ మంత్రి జగదీష్ రెడ్డి అవినీతిపై మార్చి2 తేదీ లోపల విచారణ కమిషన్ ఏర్పాటు చేయాలని మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ డిమాండ్ చేశారు.

హైదరాబాద్: తెలంగాణ మంత్రి జగదీష్ రెడ్డి అవినీతిపై మార్చి2 తేదీ లోపల విచారణ కమిషన్ ఏర్పాటు చేయాలని మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ డిమాండ్ చేశారు. ఆయన మంగళవారమిక్కడ మాట్లాడుతూ అవినీతిని నిరూపించే ఆధారాలు ఉన్నాయని, వాటిని కమిషన్ కు అందజేస్తామన్నారు.

ఒకవేళ కమిషన్ ఏర్పాటు చేయకుంటే ఏసీబీని కలిసి ఫిర్యాదు చేస్తామని తెలిపారు. ఫీజు రీయింబర్స్మెంటు నిధుల్లో కమీషన్ తీసుకునేందుకు  పల్లా రాజేశ్వర్ రెడ్డి మధ్యవర్తిత్వం వహించారని, అలాంటి వారికి ఎమ్ఎల్సీ టికెట్ ఇవ్వడం కేసీఆర్ చిత్తశుద్ధికి నిదర్శనమని మండిపడ్డారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement