breaking news
portfolio change
-
ఆయన శాఖ మార్చేస్తా: సీఎం
రెండు పడవల మీద కాళ్లేస్తానంటున్న మాజీ క్రికెటర్ నవ్‌జ్యోత్ సింగ్ సిద్ధూ వైఖరితో పంజాబ్ ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్ తంటాలు పడుతున్నారు. ఒకవైపు మంత్రిగా కొనసాగుతూనే, మరోవైపు 'ద కపిల్ శర్మ షో'లో పాల్గొంటానని సిద్ధూ కచ్చితంగా చెప్పడంతో అలాగైతే ఆయన శాఖ మార్చేయాల్సి వస్తుందని కెప్టెన్ అంటున్నారు. దానికి బదులు ఆయనకు వేరే శాఖ ఇస్తామని అన్నారు. ప్రస్తుతం సిద్ధూ వద్ద పర్యాటక, సాంస్కృతిక, మ్యూజియంల శాఖలున్నాయి. వాటిలో సాంస్కృతిక శాఖతో సిద్ధూ పాల్గొనే షోకు సంబంధం ఉంటుంది. దాంతో అప్పుడు ప్రయోజనాల వైరుధ్యానికి సంబంధించిన సమస్య వస్తుంది. అయితే.. కిరణ్ ఖేర్ పార్లమెంటు సభ్యురాలిగా ఉంటూ నటిగా కూడా కొనసాగారని సిద్ధూ వాదిస్తున్నారు. కిరణ్ ఖేర్ మాత్రం తాను మూడు సినిమాలను తిరస్కరించానని, ఎంపీ అయిన తర్వాత నటించలేదని స్పష్టం చేశారు. పంజాబ్‌లో కాంగ్రెస్ గెలుపులో సిద్ధూ పాత్ర చాలా ఉందని అందరూ అన్నారు. దాంతో ఆయనకు ఉప ముఖ్యమంత్రి పదవి ఇవ్వడం ఖాయమని కూడా వినిపించింది. అలాంటి పరిస్థితుల్లో ఆయనకు సీఎం అమరీందర్ సింగ్ ఏమాత్రం ప్రాధాన్యం లేని శాఖలు ఇచ్చారు. తాను వారానికి నాలుగు రోజులు మాత్రమే, అది కూడా రాత్రిపూట తన విధి నిర్వహణ పూర్తయిన తర్వాత షో చేస్తానంటున్నానని, బాదల్ లాగ బస్సు సర్వీసులు నడపమంటారా అని అంటూ పంజాబ్ మాజీ ఉప ముఖ్యమంత్రి సుఖ్బీర్ సింగ్ బాదల్ మీద వ్యంగ్యాస్త్రాలు విసిరారు. మరోవైపు.. సిద్ధూ కపిల్ శర్మ షోలో పాల్గొనవచ్చా లేదా అనే విషయమై సీఎం అమరీందర్ సింగ్ న్యాయ సలహా కోరారు. -
'జగదీశ్ రెడ్డి అవినీతిపై విచారణ చేపట్టాలి'
హైదరాబాద్: తెలంగాణ మంత్రి జగదీష్ రెడ్డి అవినీతిపై మార్చి2 తేదీ లోపల విచారణ కమిషన్ ఏర్పాటు చేయాలని మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ డిమాండ్ చేశారు. ఆయన మంగళవారమిక్కడ మాట్లాడుతూ అవినీతిని నిరూపించే ఆధారాలు ఉన్నాయని, వాటిని కమిషన్ కు అందజేస్తామన్నారు. ఒకవేళ కమిషన్ ఏర్పాటు చేయకుంటే ఏసీబీని కలిసి ఫిర్యాదు చేస్తామని తెలిపారు. ఫీజు రీయింబర్స్‌మెంటు నిధుల్లో కమీషన్ తీసుకునేందుకు పల్లా రాజేశ్వర్ రెడ్డి మధ్యవర్తిత్వం వహించారని, అలాంటి వారికి ఎమ్ఎల్సీ టికెట్ ఇవ్వడం కేసీఆర్ చిత్తశుద్ధికి నిదర్శనమని మండిపడ్డారు. -
'అవినీతి వల్లే జగదీశ్ రెడ్డి శాఖ మార్పు'
-
'అవినీతి వల్లే జగదీశ్ రెడ్డి శాఖ మార్పు'
తెలంగాణ విద్యాశాఖ మంత్రిగా గతంలో పనిచేసిన జగదీశ్ రెడ్డి అవినీతికి పాల్పడ్డారని, అందుకే ముఖ్యమంత్రి కేసీఆర్ ఆయన శాఖను మార్చారని మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్యే సంపత్ కుమార్ ఆరోపించారు. రెండు దఫాలుగా కాలేజీలకు విడుదల చేసిన రూ. 1,360 కోట్ల ఫీజు రీయింబర్స్‌మెంటు నిధుల్లో మంత్రి జగదీశ్ రెడ్డి, టీఆర్ఎస్ నేత పల్లా రాజేశ్వర్ రెడ్డి 5 శాతం చొప్పున కమీషన్లు తీసుకున్నారని తీవ్రంగా ఆరోపించారు. దీనిపై విచారణకు ఆదేశిస్తే.. ఈ వ్యవహారంలో జరిగిన మొత్తం అవినీతిని తాము నిరూపిస్తామని పొన్నం ప్రభాకర్, సంపత్ కుమార్ తెలిపారు. ఫీజు రీయింబర్స్మెంట్ నుంచి సంపాదించిన నిధులతో కోళ్లఫారాలలో ఇంజనీరింగ్ కాలేజీలు ఏర్పాటు చేశారని, అలాంటి 200 ఇంజనీరింగ్ కళాశాలలను కేసీఆర్ రద్దు చేశారని చెప్పారు. అయితే.. కేవలం కాలేజీల రద్దుతోనే సరిపెట్టేసిన సర్కారు.. వాటికి అనుమతులు ఇచ్చిన అధికారులపై ఎందుకు చర్యలు తీసుకోలేదని పొన్నం ప్రభాకర్, సంపత్ కుమార్ ప్రశ్నించారు. -
పథకం ప్రకారమే తప్పించారు
-
పథకం ప్రకారమే తప్పించారు
హైకమాండ్ వ్యూహం మేరకే శ్రీధర్‌బాబు శాఖ మార్పు పార్టీ అధిష్టానం అనుమతి తీసుకునే మార్పు చేపట్టిన కిరణ్ విభజన బిల్లుపై చర్చ సాఫీగా జరిగేలా చూడటమే సీఎం లక్ష్యం బిల్లును తానే అడ్డుకుంటున్నాననే భావనా కల్పించే పథకం సాక్షి. హైదరాబాద్: రాష్ట్ర విభజనకు సంబంధించి రెండు ప్రాంతాల్లోనూ పార్టీకి ప్రయోజనం కలిగించేలా ‘రోడ్ మ్యాప్’ను అమలు చేయిస్తున్న కాంగ్రెస్ అధిష్టానం వ్యూహంలో భాగంగానే.. ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి తాజాగా శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రిని మార్చినట్లు పరిశీలకులు భావిస్తున్నారు. శాసనసభ మలివిడత సమావేశాలు ఈ నెల 3వ తేదీ (శుక్రవారం) నుంచి ప్రారంభమవుతున్న నేపథ్యంలో.. శాసనసభా వ్యవహారాల శాఖను దుద్దిళ్ల శ్రీధర్‌బాబు నుంచి తప్పించి మరో మంత్రి సాకే శైలజానాథ్‌కు అప్పగించడం.. హైకమాండ్ ఆదేశాలను అమలు చేయడంలో తలెత్తుతున్న ఇబ్బందుల నుంచి బయటపడటం, సీఎం తనకు తానుగా సమైక్యాంధ్ర చాంపియన్ అనిపించుకోవడమన్న రెండు లక్ష్యాలను సాధించుకోవడానికేనని కాంగ్రెస్ వర్గాలు చెప్తున్నాయి. ‘నేను కొట్టినట్టు చేస్తా.. మీరు ఏడ్చినట్టు చేయుండి...’ అన్నట్టుగా సీఎం కిరణ్ ఈ మొత్తం వ్యవహారాన్ని నడిపించారని కాంగ్రెస్ వర్గాలు చెప్తున్నాయి. రాష్ట్ర విభజన బిల్లును మరో 24 గంటల్లో అసెంబ్లీలో చర్చకు చేపట్టాల్సిన తరుణంలో ఉన్నట్టుండి శాసనసభా వ్యవహారాల శాఖను శ్రీధర్‌బాబు నుంచి తప్పించడం ద్వారా రాజకీయవర్గాల్లో ఒక చర్చ జరగాలన్న ఉద్దేశంతోనే కిరణ్ కావాలనే ఈ చర్యకు దిగారని ఆ వర్గాలు స్పష్టంచేస్తున్నాయి. శాసనసభా వ్యవహారాల శాఖను శ్రీధర్‌బాబు నుంచి తప్పించడం ద్వారా తెలంగాణ వాదుల నుంచి తనపై ఆగ్రహావేశాలు వ్యక్తమవుతాయని, తద్వారా సీమాంధ్రలో తాను ఒక్కడే సమైక్యం కోసం పనిచేస్తున్నట్టు ప్రజలు భావిస్తారన్న లక్ష్యంతోనే కిరణ్ తాజా చర్యకు దిగినట్టు చెప్తున్నాయి. అనుకున్నట్టుగానే తెలంగాణ మంత్రులు రాష్ట్ర గవర్నర్‌ను కలిసి ఈ విషయమై కిరణ్‌పై ఫిర్యాదు చేయడాన్ని ఆ వర్గాలు ప్రస్తావిస్తున్నాయి. విభజన బిల్లు తిరిగి వెళ్లదుగా..? కిరణ్ వ్యూహాత్మకంగానే ఈ చర్యకు దిగారని చెప్పేందుకు పరిశీలకులు పలు అంశాలను విశ్లేషిస్తున్నారు. ‘శాసనసభా వ్యవహారాల శాఖను శ్రీధర్‌బాబు నుంచి తప్పించి మరొకరికి అప్పగించినంత వూత్రాన అసెంబ్లీకి వచ్చిన ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ బిల్లు తిరిగి వెనక్కి వెళ్లదు. ఒకవేళ విభజన బిల్లును శాసనసభలో అడ్డుకోవాలనుకుంటే ఇంకేదైనా మార్గం ఎంచుకోవాలి. అంతే తప్ప దానికి శాసనసభ వ్యవహారాల శాఖ వుంత్రికి ఎలాంటి సంబంధం ఉండదు. విభజన బిల్లుపై సభలో చర్చ జరపాలని గానీ వద్దనిగానీ చెప్పే అధికారం గానీ ఆ మంత్రికి లేదు. శాసనసభా వ్యవహారాల సలహా మండలి (బీఏసీ)లో తీసుకున్న నిర్ణయం మేరకు స్పీకర్ పర్యవేక్షణలో మాత్రమే సమావేశాలు సాగుతాయి. బీఏసీ సమావేశం జరిగినప్పుడు జనవరి 23 వరకు బిల్లుపై చర్చిద్దామని ప్రతిపాదించిందే ముఖ్యమంత్రి. ఆ మేరకే అసెంబ్లీ ఎజెండా ఖరారైంది కూడా. బీఏసీ నిర్ణయూలపై అసెంబ్లీ నోట్ విడుదల చేయూలి. కానీ ఆ సంప్రదాయూనికి భిన్నంగా ఆ రోజున ప్రత్యేకంగా సీఎం పేరుతో నోట్‌ను విడుదల చేశారు. సమావేశాలను సవ్యంగా జరిపించడంలో స్పీకర్‌కు సహకరిస్తూ ప్రభుత్వానికి, మిగిలిన పక్షాలకు మధ్య సమన్వయం చేయడం తప్ప చర్చ వద్దని చెప్పడం గానీ ఇతర పక్షాలు, సభ్యుల వాదనను గానీ శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి అడ్డుకోలేరు’ అని వారు వ్యాఖ్యానిస్తున్నారు. మూడు నెలల్లో ఆదాయం పెంచగలరా? ‘ఇక మంత్రిత్వ శాఖల విషయానికి వస్తే ఒక్క వాణిజ్యపన్నుల శాఖే కాదు రాష్ట్ర పరిపాలనా వ్యవహారాల్లో అత్యంత కీలకమైన హోంశాఖ, ఎక్సయిజ్, విద్యుత్ వంటి ముఖ్యమైన శాఖలన్నీ సీఎం వద్దే ఉన్నాయి. ఎంతో కాలంగా ఆ శాఖలకు మంత్రులెవరినీ కిరణ్ నియమించలేదు. తవుకు కీలక శాఖలు కాకుండా చిన్న శాఖలు ఇచ్చారని సీనియుర్ వుంత్రులు తీవ్ర అసంతృప్తితో అధిష్టానానికి ఫిర్యాదులు పంపినా సీఎం తనవద్ద అదనంగా ఉన్న కీలక శాఖలను వారికి ఇచ్చే ప్రయత్నం కూడా చేయలేదు. తాజాగా స్వయంగా ఆయన పర్యవేక్షణలో ఉన్న వాణిజ్యశాఖ ద్వారా రాబడి తగ్గిపోయిందని.. ఇంత కాలం తర్వాత.. అది కూడా మరో మూడు నెలల్లో ఆర్థిక సంవత్సరం ముగుస్తున్న తరుణంలో ఆ శాఖను శ్రీధర్‌బాబుకు అప్పగించడం అర్థంలేనిదని అందరికీ స్పష్టవువుతోంది. పైగా ఎన్నికల సమయంలో రాష్ట్ర ప్రభుత్వం ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌ను మాత్రమే పెట్టగలదే తప్ప వచ్చే ఆర్థిక సంవత్సరానికి పూర్తి బడ్జెట్ ప్రవేశపెట్టజాలదు. అలాంటప్పుడు ఆగమేఘాలపై వాణిజ్య పన్నుల రాబడిని పెంచాలన్న అంశంపై ఇప్పుడు దృష్టి సారించడాన్ని బట్టి చూస్తే ముఖ్యమంత్రి చెప్తున్న వాదనలో ఏ మాత్రం పసలేదని తేలిపోతోంది’ అని విశ్లేషకులు పేర్కొంటున్నారు. సైమైక్యవాదిగా చెప్పుకునే డ్రామా... ‘మంత్రుల శాఖలను మార్చడం, చేర్చుకోవడం, తొలగించడం వంటి అంశాల్లో ముఖ్యమంత్రికి సర్వ అధికారాలు ఉంటాయి. ఉన్నట్టుండి సీఎంకు వాణిజ్య పన్నుల రాబడిపై ఆందోళన ఉన్నట్టయితే ఆ కీలకమైన శాఖను మరో మంత్రికి అదనంగా అప్పగించవచ్చు. లేదా కొత్త వ్యక్తికి అప్పగించవచ్చు. ఇప్పుడున్న అనిశ్చిత పరిస్థితుల్లో ముఖ్యమంత్రి చేతిలో ఉన్న వాణిజ్య పన్నుల శాఖ సరైన ఫలితాలు చూపించలేనప్పుడు మరో మంత్రి మాత్రం అధికాదాయన్ని రాబట్టడం సాధ్యమవుతుందా?’ అని పరిశీలకులు ప్రశ్నిస్తున్నారు. అలాగే.. ప్రస్తుత కేబినేట్లో శ్రీధర్‌బాబు మొదటి నుంచి కిరణ్‌కుమార్‌రెడ్డికి అత్యంత సన్నిహితుడిగా పేరుందని గుర్తుచేస్తున్నారు. ‘పైగా సీఎం నిర్ణయాలకు, ఆదేశాలకు వ్యతిరేకంగా శ్రీధర్‌బాబు వ్యవహరించింది కూడా ఏమీ లేదు. డిసెంబర్ 12న ప్రారంభమైన శాసనసభ తొలి విడత సమావేశాలను పురస్కరించుకుని స్పీకర్ బీఏసీ నిర్వహించగా, ఆ సమావేశానికి ముఖ్యమంత్రి గైర్హాజరయ్యారు. ఆయన తరఫున ఆర్థికమంత్రి ఆనం రామనారాయణరెడ్డి సమావేశాల అజెండాను అంగీకరించారు. విభజన బిల్లుపై చర్చకు సంబంధించిన అజెండా ఖరారు చేయడానికి రెండోసారి బీఏసీ సమావేశమైనప్పుడు స్వయంగా ముఖ్యమంత్రే జనవరి 23 వరకు చర్చ జరగాలని కోరడం, ఆ మేరకు అసెంబ్లీ షెడ్యూలు విడుదల చేయడం జరిగిపోయింది. ఇంత జరిగాక ఇంకా ఈ సమయంలో శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి అదనంగా చేసేదేమీ ఉండదు. సభా వ్యవహారాల వుంత్రిగా శ్రీధర్‌బాబు.. సీఎం కిరణ్ వ్యూహాలను అడ్డుకునేదీ ఏమీ ఉండదు. అరుునా సీఎం ఆయున నుంచి ఆ శాఖను తప్పించడం కేవలం సమైక్యవాదిగా చెప్పుకొనేందుకు వేసిన ఒక డ్రావూ వూత్రమేనని స్పష్టవువుతోంది’ అని వారు వ్యాఖ్యానిస్తున్నారు. అందివచ్చిన అవకాశంగా... కేబినేట్లో తనకు అత్యంత సన్నిహితుడిగా ఉన్న శ్రీధర్‌బాబు విషయంలో ముఖ్యమంత్రి కిరణ్ వ్యూహాత్మకంగా వ్యవహరించారన్నది సుస్పష్టమని పరిశీలకులు చెప్తున్నారు. ‘శ్రీధర్‌బాబు శాఖను మార్చినట్టే మార్చి ప్రాధాన్యత కలిగిన వాణిజ్యపన్నుల శాఖను కట్టబెట్టారు. విభజన బిల్లు శాసనసభలో స్పీకర్ ప్రవేశపెట్టిన తర్వాత దానిపై చర్చను ప్రారంభించాలని శ్రీధర్‌బాబు సభలో కోరడం, ఆ తర్వాత చర్చ ప్రారంభమైందని సభ బయట చెప్పడం, గతంలో అసెంబ్లీ ప్రొరోగ్ చేయడానికి సంబంధించిన ఫైలు పంపకుండా తనవద్దే పెట్టుకోవడం వంటి అంశాలను ముఖ్యమంత్రి తనకుఅందివచ్చిన అవకాశంగా మార్చుకున్నారు. శ్రీధర్‌బాబును మార్చితే తెలంగాణ వాళ్లకు కోపమొస్తుంది. విభజనను అడ్డుకోవడానికి మాత్రమే ఈ పని చేశారని సీమాంధ్రలో తనకు సమైక్యవాదినన్న పేరు దక్కుతుంది. ఈ ప్లాన్ ప్రకారమే ఈ శాఖల వూర్పు చేసినట్టు సీఎం తాజా చర్యలు స్పష్టం చేస్తున్నాయి’ అని వారు పేర్కొంటున్నారు. నిజానికి రాష్ట్ర కేబినేట్లో ముఖ్యమంత్రికి ఉప ముఖ్యమంత్రికి మధ్య ఎన్నో విబేధాలున్నాయని, దామోదర రాజనర్సింహ సూచించిన ఏ పని జరక్కుండా ముఖ్యమంత్రి అడ్డుకుంటున్నారన్న ఆరోపణలూ ఉన్నాయని, తనకు వ్యతిరేకంగా పనిచేస్తున్న వారినే సీఎం తప్పించాలనుకుంటే ఆ జాబితాలో డిప్యూటీ సీఎంతో పాటు పలువురు మంత్రులు ఉన్నారని విశ్లేషకులు గుర్తుచేస్తున్నారు. ఆది నుంచీ అంతే... ముఖ్యమంత్రి వ్యవహార శైలిపై పార్టీలోని సీమాంధ్ర నేతలు మొదటి నుంచీ సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. సీడబ్ల్యూసీ తెలంగాణ ఇవ్వాలని తీర్మానం చేసింది మొదలుఇప్పటివరకు అనేక దశల్లో రాష్ట్ర విభజనను కిరణ్‌కుమార్‌రెడ్డి తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారన్న భావన కల్పించుకుంటున్నారే తప్ప విభజనను అడ్డుకునే పని ఒక్కటి కూడా చేయలేదని కాంగ్రెస్ సీమాంధ్ర నేతలే చెప్తుంటారు. ‘హైకమాండ్ విభజన నిర్ణయం తీసుకున్న రోజే సీఎం రాజీనామా చేసి ఉంటే అసలు అసెంబ్లీ ఉండేది కాదు.. ఈ చర్చకు ఆస్కారమే లేదు. ఆ తర్వాత కేంద్ర మంత్రివర్గ కమిటీ విభజనపై నివేదికను సమర్పించకముందు, కేంద్ర కేబినెట్ విభజన ముసాయిదా బిల్లును ఆమోదించకముందు, ఆ బిల్లు రాష్ట్రపతి నుంచి రాష్ట్ర అసెంబ్లీకి రాకముందు.. ఇలా ఎన్నో దశల్లో రాష్ట్ర విభజనను అడ్డుకునేందుకు అవకాశాలు ఉన్నాయి. అసెంబ్లీలో సమైక్య తీర్మానం చేసి ముందుగా పంపించవచ్చు. కానీ.. అన్ని దశల్లోనూ తానే అడ్డుకుంటానంటూ మాటలు చెప్తున్న ముఖ్యమంత్రి కిరణ్.. అంతర్గతంగా విభజనకు సహకరిస్తూ వస్తున్నారు. ఏదీ చేయకుండా అడుగడుగునా అడ్డుకునే ప్రయత్నాలు చేస్తున్నారన్న భావన కల్పించడంలో కిరణ్ చాలా తెలివిగా బిల్లును అసెంబ్లీ వరకు వచ్చేట్టు వ్యవహారాలు నడిపించారు. చివరికి.. ఇటీవల కిరణ్‌కు సన్నిహితుడుగా ఉండే ఏపీఎన్జీవో సంఘ నేత ఒకరు నిర్వహించిన అఖిలపక్ష సమావేశంలో.. పార్టీలకతీతంగా ఎమ్మెల్యేలందరూ రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీకి అఫిడవిట్లు అందించాలనీ నిర్ణయించారు. రాష్ట్రపతి హైదరాబాద్ వచ్చారు.. కొన్ని రోజుల విడిది అనంతరం ఢిల్లీ కూడా వెళ్లిపోయారు.. కానీ కిరణ్ మాత్రం అఫిడవిట్ల ఊసే ఎత్తలేదు’ అని సీమాంధ్ర సీనియర్ మంత్రి ఒకరు వ్యాఖ్యానించారు. హైకమాండ్ అనుమతితోనే... పీసీసీ చీఫ్ బొత్స సత్యనారాయణను కూడా మంత్రివర్గం నుంచి తొలగించాలని సీఎం అనేకసార్లు ప్రయత్నించినప్పటికీ కాంగ్రెస్ హైకమాండ్ అంగీకరించలేదనే విషయాన్ని ఈ సందర్భంగా పరిశీలకులు గుర్తుచేస్తున్నారు. ‘మంత్రివర్గంలో మార్పుచేర్పులు చేసుకోవడానికి అవకాశమివ్వాలని సీఎం కిరణ్ ఢిల్లీ వెళ్లి చెప్పుకున్నా హైకమాండ్ అంగీకరించలేదు. అలాంటిది ఈ కీలక సమయంలో తెలంగాణకు చెందిన శ్రీధర్‌బాబు శాఖను ఉన్నట్టుండి మార్చే సాహసం.. పార్టీ హైకమాండ్ ఆదేశాలు లేకుండా ముఖ్యమంత్రి చేయరు’ అని వారు స్పష్టంచేస్తున్నారు. ఇప్పుడు కూడా సీఎం కిరణ్ తన తాజా నిర్ణయంపై ముందుగానే హైకమాండ్ పెద్దలతో చర్చించి, వారి ఆమోదం మేరకే నిర్ణయం తీసుకున్నారని కాంగ్రెస్ వర్గాలు చెప్తున్నాయి. శుక్రవారం నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమవుతున్న తరుణంలో విభజన బిల్లుపై చర్చ జరక్కుండా వైఎస్సార్ కాంగ్రెస్ లాంటి సమైక్యవాద పార్టీలు అడ్డుకునే అవకాశాలు ఉండటంతో ముందుగానే తానే ఏదో చేశానన్న అభిప్రాయం కల్పించడానికి సీఎం హైకమాండ్ పెద్దలతో మాట్లాడి శ్రీధర్‌బాబును మార్చినట్టు ఆ వర్గాల సమాచారం. అదీగాక.. ‘అసెంబ్లీ ప్రొరోగ్ ఫైలు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి పంపకుండా శ్రీధర్‌బాబు తన వద్దే పెండింగ్‌లో పెట్టుకున్నారన్న విషయంలో ఆగ్రహంగా ఉండి ఉంటే ఆ రోజే ఆయనను ముఖ్యమంత్రి భర్తరఫ్ చేసేవారు. లేదా అప్పుడే శాఖను మార్చేవారు’ అని కాంగ్రెస్ వర్గాలు పేర్కొన్నాయి. ‘పైగా విభజన బిల్లుపై అసెంబ్లీలో చర్చ ప్రారంభమైందని బీఏసీ సమావేశంలో శ్రీధర్‌బాబు చెప్పినప్పుడు సీమాంధ్రకు చెందిన కొందరు అభ్యంతరం వ్యక్తం చేయగా.. అయిందేదో అయిపోయింది.. దాన్ని వివాదం చేసి పెద్దది చేయకండని చెప్పిందే ముఖ్యమంత్రి’ అని ఆ వర్గాలు గుర్తుచేస్తున్నాయి. శైలజానాథ్ చేసేదేంటి? శ్రీధర్‌బాబు నుంచి అసెంబ్లీ వ్యవహారాలను తప్పించి మరో మంత్రి శైలజానాథ్‌కు అప్పగించగా.. శుక్రవారం నుంచి ప్రారంభమవుతున్న సమావేశాల్లో ఆ శాఖ మంత్రిగా ఆయున పెద్దగా చేసే కార్యక్రమాలేవీ లేవని పరిశీలకులు పేర్కొంటున్నారు. ‘బీఏసీలో అజెండా ఇప్పటికే నిర్ణయం జరిగిపోయింది. విభజన బిల్లు సందర్భంగా వివిధ రాష్ట్రాల అసెంబ్లీల్లో చర్చ జరిగిన తీరును పరిశీలించి వచ్చిన స్పీకర్ అవసరమైతే ఆ విషయాలను వెల్లడించడానికి ఫ్లోర్ లీడర్లతో సమావేశం ఏర్పాటు చేసే అవకాశం ఉంది. లేదా ముఖ్యమంత్రి అనుమతి మేరకు మరోసారి బీఏసీ సమావేశం ఏర్పాటు చేసే ఆస్కారం కూడా ఉంది. విభజన బిల్లుపై చర్చ జరగాలని తెలంగాణ నేతలు కోరుతుండగా, సమైక్యవాదులు చర్చను అడ్డుకునే అవకాశముంది. ఇంతకాలం సమైక్యాంధ్ర ప్రజాప్రతినిధుల ఫోరం కన్వీనర్‌గా వ్యవహరిస్తున్న శైలజానాథ్‌ను శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రిగా చేసి ఇప్పుడు సభలో కార్యక్రమాలు సజావుగా నిర్వహించేలా చూసే బాధ్యతలను ఆయనకే సీఎం కిరణ్ అప్పగించారు. ఇదీ కిరణ్ వ్యూహంలో భాగమే’ అని వారు విశ్లేషిస్తున్నారు. శాసనసభలో సమైక్యవాదానికి వుద్దతు లేకుండా చేయుడానికే సీఎం వ్యూహాత్మకంగా ఆ గొంతులూ నొక్కేలా ఈ శాఖల వూర్పు చేశారన్న అనువూనాలు కాంగ్రెస్‌లోనే వ్యక్తవువుతున్నారుు.