సొంత పార్టీ నేతలనే భ్రమల్లో పెడుతున్నారు | Ponguleti Sudhakar Reddy Fire on CM KCR | Sakshi
Sakshi News home page

సొంత పార్టీ నేతలనే భ్రమల్లో పెడుతున్నారు

Mar 27 2017 2:55 AM | Updated on Aug 14 2018 11:02 AM

సొంత పార్టీ నేతలనే భ్రమల్లో పెడుతున్నారు - Sakshi

సొంత పార్టీ నేతలనే భ్రమల్లో పెడుతున్నారు

కాంగ్రెస్‌ పార్టీని 100 మంది కేసీఆర్‌లు కూడా ఏమీ చేయలేరని శాసనమండలిలో కాంగ్రెస్‌ ఉపనేత పొంగులేటి సుధాకర్‌రెడ్డి అన్నారు.

సీఎం కేసీఆర్‌పై పొంగులేటి ధ్వజం
సాక్షి, హైదరాబాద్‌: కాంగ్రెస్‌ పార్టీని 100 మంది కేసీఆర్‌లు కూడా ఏమీ చేయలేరని శాసనమండలిలో కాంగ్రెస్‌ ఉపనేత పొంగులేటి సుధాకర్‌రెడ్డి అన్నారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, సర్వే పేరుతో సొంత పార్టీ నేతలను, ప్రజలను భ్రమల్లో ఉంచుతున్నారని చెప్పారు. క్షేత్రస్థాయిలో వాస్తవంగా ఉన్న పరిస్థితులను చెప్పడంలేదని విమర్శించారు.

 కాగా, వచ్చే ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌కు 100 సీట్లు వస్తాయని సీఎం కేసీఆర్‌ పగటికలలు కంటున్నారని కాంగ్రెస్‌ నేత టి.జయ ప్రకాశ్‌రెడ్డి (జగ్గారెడ్డి) అన్నారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, సంగారెడ్డిలో ఉన్న వ్యవసాయ ఇంజనీరింగ్‌ యూనివర్సిటీ విద్యార్థుల సమస్యలను సీఎం పట్టించుకోవడంలేదని విమర్శించారు. విద్యార్థులు, నిరుద్యోగులతో సోమవారం అసెంబ్లీని ముట్టడిస్తామని హెచ్చరించారు.

Advertisement
 
Advertisement
Advertisement