సూర్యం దళాన్ని చుట్టుముట్టిన పోలీసులు..! | Police Surrounded Maoist Surya Dalam In Nallabelli | Sakshi
Sakshi News home page

సూర్యం దళాన్ని చుట్టుముట్టిన పోలీసులు..!

Feb 28 2019 11:46 AM | Updated on Feb 28 2019 12:07 PM

Police Surrounded Maoist Surya Dalam In Nallabelli - Sakshi

సాక్షి, వరంగల్‌ : సీపీఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీకి చెందిన మావోయిస్టు సూర్యం దళాన్ని నల్లబెల్లి మండలం కొండాపూర్ శివారు గణేశ్(మురళి)నగర్ వద్ద పోలీసులు గురువారం ఉదయం చుట్టుముట్టారు. దళ సభ్యుడు లక్ష్మణ్‌, మరో ఇద్దరు సానుభూతి పరులను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్దనున్న సమాచారం మేరకు మిగతా దళ సభ్యుల కోసం గాలింపు చేపట్టారు. ఏసీపీ సునీతామోహన్‌ ఆధ్వర్యంలో ఈ ఆపరేషన్‌ కొనసాగుతోంది. కాగా, మావోయిస్టులను చుట్టుముట్టే క్రమంలో పోలీసులను గ్రామస్తులు అడ్డుకున్నట్లు తెలిసింది.   (ఇన్‌ఫార్మర్‌ నెపంతో రైతు హత్య)

Advertisement
 
Advertisement
Advertisement