breaking news
suryam
-
సూర్యం దళాన్ని చుట్టుముట్టిన పోలీసులు..!
-
సూర్యం దళాన్ని చుట్టుముట్టిన పోలీసులు..!
సాక్షి, వరంగల్ : సీపీఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీకి చెందిన మావోయిస్టు సూర్యం దళాన్ని నల్లబెల్లి మండలం కొండాపూర్ శివారు గణేశ్(మురళి)నగర్ వద్ద పోలీసులు గురువారం ఉదయం చుట్టుముట్టారు. దళ సభ్యుడు లక్ష్మణ్, మరో ఇద్దరు సానుభూతి పరులను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్దనున్న సమాచారం మేరకు మిగతా దళ సభ్యుల కోసం గాలింపు చేపట్టారు. ఏసీపీ సునీతామోహన్ ఆధ్వర్యంలో ఈ ఆపరేషన్ కొనసాగుతోంది. కాగా, మావోయిస్టులను చుట్టుముట్టే క్రమంలో పోలీసులను గ్రామస్తులు అడ్డుకున్నట్లు తెలిసింది. (ఇన్ఫార్మర్ నెపంతో రైతు హత్య) -
'టీడీపీలో చేరకపోతే చంపేస్తామన్నారు'
సాక్షి, అనంతపురం: అనంతపురం జిల్లాలో మంత్రి పరిటా సునీత ఆదేశాలతోనే ప్రతిపక్ష వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలపై అక్రమ కేసులు బనాయిస్తున్నారని, కార్యకర్తలపై దాడులు జరుగుతున్నాయని మరోసారి రుజువైంది. టీడీపీలో చేరకపోతే చంపుతామని తనను ఆ పార్టీ కార్యకర్తలు బెదిరించారని దాడికి గురైన వైఎస్ఆర్ సీపీ కార్యకర్త బోయ సూర్యం తెలిపారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ.. మంత్రి పరిటాల సునీత ఆదేశాలతోనే వైఎస్ఆర్సీపీ నేతలు, కార్యకర్తలపై అక్రమ కేసులు బనాయిస్తున్నారు. మంత్రి సునీత తనయుడు శ్రీరామ్ సమక్షంలోనే నాపై దాడి జరిగింది. కానీ నాతో బలవంతంగా టీడీపీ నేతలు సంతకాలు సేకరించారు. టీడీపీలో చేరకపోతే చంపుతామని బెదిరించి తెల్లకాగితాలపై సంతకాలు చేయిస్తుంటే పోలీసులు ఏమీ అనలేదు. అదే సంతకంతో వైఎస్సార్సీపీ నేతలు తోపుదుర్తి చందు, నాగరాజులపై పోలీసులు అక్రమంగా కేసులు నమోదుచేశారు. పరిటాల వర్గీయులు అరాచకాలు చేస్తుంటే రామగిరి సీఐ, ఎస్ఐ, ఇతర పోలీసులు ప్రేక్షకపాత్ర పోషించారు. మంత్రి సునీత నుంచి నాకు ప్రాణహాని ఉంది, దయచేసి రక్షణ కల్పించాలంటూ వైఎస్ఆర్ సీపీ కార్యకర్త బోయ సూర్యం విజ్ఞప్తి చేశారు. మంత్రి సునీతను పదవి నుంచి బర్తరఫ్ చేయాలి: ప్రకాష్ రెడ్డి రామగిరి మండలంలో పోలీసు వ్యవస్థ లేదు. మంత్రి పరిటాల సునీత అరాచకాలపై ఎస్పీ మౌనంగా ఉన్నారు. రామగిరిలో సమావేశాలు నిర్వహించేందుకు మూడేళ్లుగా అడుగుతున్నా అనుమతి ఇవ్వటం లేదు. మంత్రి సునీత, ఆమె తనయుడు శ్రీరామ్ అరాచకంగా వ్యవహరిస్తున్నారు. రామగిరిలో వైఎస్సార్ సీపీ కార్యకర్త సూర్యంపై దాడి చేసి.. మాపైనే అక్రమ కేసులు బనాయించటం ఏం న్యాయమని వైఎస్సార్ సీపీ రాప్తాడు సమన్వయకర్త తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి ప్రశ్నించారు. మంత్రి పరిటాల సునీతను వెంటనే మంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేయాలని ఏపీ సర్కార్‌ను డిమాండ్ చేశారు. పరిటాల వర్గీయుల అరాచకాలపై హైకోర్టులో కేసు వేసి న్యాయాన్ని పరిరక్షించుకుంటామని ప్రకాష్ రెడ్డి అన్నారు. వైఎస్సార్ సీపీ రాప్తాడు సమన్వయకర్త తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి -
సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయండి
ఆత్మకూర్ (నర్వ) : బీడీ కట్టలపై 85శాతం గొంతు క్యాన్సర్ బొమ్మ జీఓ 727ను తక్షణమే రద్దుచేయాలని డిమాండ్ చేస్తు సెప్టెంబర్ 2న నిర్వహిస్తున్న సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని ఐఎఫ్టీయు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సూర్యం పిలుపునిచ్చారు. శుక్రవారం అమరచింతలోని అమతం బీడీ ఫ్యాక్టరీలో మాట్లాడారు. ఎన్డీఏ ప్రభుత్వం కార్మిక వ్యతిరేక విధానాలతో దూకుడుగా ముందుకు పోతుందని విమర్శించారు. బడా కార్పొరేట్లకు మరింత సంపద చేకూర్చేందుకే ప్రధాని నరేంద్రమోదీ పరిపాలనా విధానాలు దోహదం చేస్తున్నాయని ఆరోపించారు. పెట్టుబడిదారుల కుట్రలకు కేంద్రప్రభుత్వం వంతపాడుతూ 720 జీఓను తీసుకొచ్చి బీడీ కట్టలపై 85 క్యాన్సర్బొమ్మను గుర్తించడం అవివేకం అన్నారు. కార్మికులకు కనీస వేతనం నెలకు రూ.18వేలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఆ సంఘం జిల్లా కార్యదర్శి అరుణ్‌కుమార్, చింతలన్న, రాజు, లక్ష్మి, ఇందిరా, వెంకట్‌రెడ్డి, భూషణం పాల్గొన్నారు.