ఎన్నికలపై పోలీసుల ప్రత్యేక దృష్టి 

Police Special Duty In Elections Warangal - Sakshi

పాత నేరస్తులు, రౌడీషీటర్లను తహసీల్దార్ల ఎదుట బైండోవర్‌

మారుమూల గ్రామాల్లోని బెల్ట్‌ షాపులూ మూసివేత 

సాక్షి, నేలకొండపల్లి: ఎన్నికల కోడ్‌ నేపథ్యంలో పాత నేరస్తులు...నాటు సారా విక్రయదారులు...బెల్ట్‌షాపు నిర్వాహకులు, రౌడీషీటర్లు, సమస్యాత్మక వ్యక్తుల కదలికలపై పోలీసులు దృష్టి సారించా రు. 
సార్వత్రిక ఎన్నికల్లో నామినేషన్ల ప్రక్రియ మొదలవటంతో ఎన్నికల ప్రచారం వేడెక్కుతోంది. గ్రామాల్లో, పట్టణాల్లో అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసు అధికారులు ముందస్తు చర్యలు చేపడుతున్నారు. 

ముందస్తు జాగ్రత్తలు
ముందస్తు ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో జరిపేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. జిల్లాలో ని అన్ని పోలీస్‌స్టేషన్లు, సర్కిల్, డివిజన్, జిల్లా కార్యాలయాల వారీగా పలువురిని పిలిపించి తహసీల్దార్‌ ఎదుట బైండోవర్‌ చేస్తున్నారు. మద్యం సేవించి ఎన్నికల సమయంలో గోడవలు సృష్టించే వారిని, రాజకీయ కక్ష సాధింపు అల్లర్లు చేసే వారిని బైండోవర్‌ చేస్తున్నారు. పాత నేరస్తులకు పోలీసులు కౌన్సిలింగ్‌ ఇస్తున్నారు.  వారం వారం పోలీస్‌స్టేషన్‌కు హాజరయ్యేలా తగిన చర్యలు తీసుకుంటున్నారు. 

పల్లెలు ప్రశాంతం
జిల్లాలోని ప్రతీ మారుమూల గ్రామంలో ఉన్న బెల్ట్‌షాపులు మూసివేయటంతో పల్లెలు ప్రశాంతంగా ఉన్నాయి. ఎన్నికల కోడ్‌ ఉన్నందున్న గ్రామాల్లో ఎలాంటి గొడవలు జరగకుండా మద్యం, సారా ఇతరత్రా పదార్థాలు విక్రయాలు లేకుండా పోలీసులు గట్టి నిఘా ఉంచారు.  గ్రామాల్లో మందు లేకపోవటంతో మద్యం ప్రియులు పొద్దుగూక ముందే ఇంటికి చేరుతున్నారు. దీంతో మహిళలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. 

బైండోవర్‌ చేస్తున్నాం
అసెంబ్లీ ఎన్నికలను ప్రశాంతంగా జరిపించేందుకు పాత నేరస్తులను ముందస్తుగా బైండోవర్‌ చేస్తున్నాం. ప్రజలు తమ ఓటు హక్కును ప్రశాం తంగా వినియోగించుకునేందుకు ఎలాంటి ఆటంకాలు లేకుండా ఉండేలా చర్యలు చేపట్టాం. పాత నేరస్తులు, బెల్ట్‌షాపు నిర్వాహకులపై బైండోవర్‌ కేసులు నమోదు చేస్తున్నాం. ఇప్పటి వరకు 17 కేసు లు నమోదు చేసి 407మందిని బైండోవర్‌ చేశాం. ఓటు హక్కు వినియోగంపై కళాజాతా ద్వారా చైతన్యం చేస్తున్నాం. ఎక్కడైనా మద్యం, సారా విక్రయాలు జరిపితే సహించేది లేదు. 
–ఎన్‌.గౌతమ్, ఎస్సై, నేలకొండపల్లి  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top