వ్యభిచార గృహంపై పోలీసుల దాడులు | Police raids on brothels | Sakshi
Sakshi News home page

వ్యభిచార గృహంపై పోలీసుల దాడులు

Sep 4 2014 11:15 PM | Updated on Sep 2 2017 12:52 PM

గుట్టుచప్పుడు కాకుండా వ్యభిచారం కొనసాగిస్తున్న ఓ గృహంపై పోలీసులు దాడి చేసి నిందితులను అరెస్టు చేశారు.

 నారాయణఖేడ్ : గుట్టుచప్పుడు కాకుండా వ్యభిచారం కొనసాగిస్తున్న ఓ గృహంపై పోలీసులు దాడి చేసి నిందితులను అరెస్టు చేశారు. సీఐ ముని కథనం మేరకు..  గురువారం పట్టణ బైపాస్ రోడ్డులో గల వాటర్ ట్యాంకు వద్ద ఉన్న సువర్ణ ఇంట్లో వ్యభిచారం జరుగుతోందని సమాచారం అందిందన్నారు. దీంతో దాడులు నిర్వహించి సువర్ణ, సత్యమ్మలతో పాటు బాధితులు రేణుక, రామవ్వ విటుడు సర్దార్ రవిలను అదుపులోకి తీసుకున్నామని తెలిపారు.

ఖేడ్‌కు చెందిన సువర్ణ, సత్యమ్మలు ఇద్దరు కలిసి సువర్ణ గృహంలో వ్యభిచారం జరుపుతున్నారని విచారణలో వెల్లడైందన్నారు. ర్యాలమడుగుకు చెందిన రేణుక, రామవ్వలను వ్యభిచారంలోకి దింపారని, దాడులు సమయంలో ఇంట్లో రూ.5 వేల నగదు, 6 సెల్‌ఫోన్లు, కండోమ్ ప్యాకెట్లు, బీరు, కల్లు సీసాలు లభించగా వాటిని సీజ్ చేసినట్లు సీఐ వివరించారు. సువర్ణ, సత్యమ్మ, రవిలపై పిటా యాక్ట్ కింద కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలిస్తున్నట్టు తెలిపారు. రేణుక, రామవ్వలను సంగారెడ్డిలోని రెస్క్యూ హోంకు తరలిస్తామని తెలిపారు.

 ఖేడ్ సర్కిల్‌లో అసాంఘిక కార్యకలాపాలు జరిగితే ప్రజలు వెంటనే సమాచారాన్ని పోలీసులకు అందించాలన్నారు. సమాచారం అందించిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని తెలిపారు. దాడుల్లో ఎస్‌ఐలు సునీల్, శ్రీనివాస్, పోలీసు సిబ్బంది ఉన్నారని సీఐ పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement