‘షేర్‌’కింగ్‌లూ.. జాగ్రత్త

Police Focus On Social Media - Sakshi

సోషల్‌ మీడియాపై పోలీస్‌ నజర్‌

సాక్షి, హైదరాబాద్‌: ఢిల్లీలో హింస చెలరేగిన నేపథ్యంలో రాష్ట్ర పోలీసులు అప్రమత్తమయ్యారు. రాష్ట్రంలో శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నారు. సున్నిత, అతి సున్నిత, సమస్యాత్మక ప్రాంతాల్లో ప్రత్యేక నిఘా ఉంచాలని, వదంతులు నమ్మవద్దని డీజీపీ కార్యాలయం నుంచి రాష్ట్రంలోని అన్ని జిల్లాల ఎస్పీలు, కమిషనర్లకు ఆదేశాలు వెళ్లాయి.

చర్యలేంటి? 
- సోషల్‌ మీడియాలో ఇష్టానుసారంగా కామెంట్లు చేస్తే.. ఐటీ యాక్ట్‌ సెక్షన్‌ 66(ఏ) ప్రకారం పోలీసులు అరెస్టు చేసే వీలుంది. 
వ్యక్తుల పరువుకు భంగం వాటిల్లే పోస్టులు పెడితే.. ఐపీసీ 499 సెక్షన్‌ ప్రకారం కేసులు నమోదు చేయవచ్చు. 
ఒక వ్యక్తిని లేదా సంస్థ ప్రతిష్టకు భంగం వాటిల్లేలా పోస్టులు పెడితే.. పరువు నష్టం దావా వేసే వీలుంది. 
అసభ్యకర పోస్టులు పెట్టి ఇతరులను ఇబ్బందులకు గురిచేస్తే.. ఐపీసీ సెక్షన్లు 292, 292 (ఏ), 293, 294 ప్రకారం అరెస్టు అవుతారు.  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top