39 నాటు బాంబులు స్వాధీనం | police arrested 4 persons and caught 39 bombs | Sakshi
Sakshi News home page

39 నాటు బాంబులు స్వాధీనం

Feb 13 2015 11:13 PM | Updated on Oct 1 2018 4:01 PM

39 నాటు బాంబులు స్వాధీనం - Sakshi

39 నాటు బాంబులు స్వాధీనం

వరంగల్ జిల్లా వెంకటాపురం మండల కేంద్రం చివర ఉన్న ఓ మొక్కజొన్న పొలంలో 39 నాటు బాంబులను స్వాధీనం చేసుకుని, నలుగురిని అరెస్టు చేశారు.

వెంకటాపురం: వరంగల్ జిల్లా వెంకటాపురం మండల కేంద్రం చివర ఉన్న ఓ మొక్కజొన్న పొలంలో 39 నాటు బాంబులను స్వాధీనం చేసుకుని, నలుగురిని అరెస్టు చేశారు. మొక్కజొన్న పంటను అటవీ జంతువుల బారి నుంచి కాపాడుకోవటానికి కొంత మంది రైతులు పొలంలో అక్కడక్కడా నాటు బాంబులు పెట్టారు.

ఈ నెల 10న అందులోని ఓ నాటు బాంబు పేలి రాజేశ్వర్ రావు అనే రైతు తీవ్రంగా గాయపడ్డాడు. మొత్తం 40 బాంబులు పాతిపెట్టగా అందులో ఒక బాంబు పేలింది. రాజేశ్వర్ రావు ఫిర్యాదు మేరకు కంచం అశోక్, రెడ్డి దామోదర్, గంటా నరసింగం, మేకల మల్లయ్య అనే రైతులను పోలీసులు అరెస్టు చేశారు.

 

Advertisement
 
Advertisement
Advertisement