నేషనల్‌ పూల్‌లోకి పీజీ మెడికల్‌

PG Medical into National Pools - Sakshi

రాష్ట్రంలో మొదటిసారి వర్తింపు

వారంలో కౌన్సెలింగ్‌ షెడ్యూలు విడుదల 

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణలో ఈసారి పీజీ వైద్య సీట్లకు నేషనల్‌ పూల్‌ పద్ధతిని అమలు చేయనున్నారు. దీంతో రాష్ట్ర విద్యార్థులు దేశవ్యాప్తంగా వైద్య పీజీ సీట్లలో 15 శాతం కోటాకు పోటీ పడనున్నారు. అలాగే రాష్ట్రంలోని 15 శాతం సీట్లను దేశవ్యాప్తంగా ఉండే అభ్యర్థులు మెరిట్‌ ప్రాతిపదికన దక్కించుకునే అవకాశం ఉంటుంది. ఈ మేరకు వైద్య విద్య పీజీ సీట్ల భర్తీకి కాళోజీ ఆరోగ్య విజ్ఞాన వర్సిటీ ఏర్పాట్లు చేస్తోంది.  

రెండు మూడు రోజుల్లో ర్యాంకులు.. 
నేషనల్‌ బోర్డు ఆఫ్‌ ఎగ్జామినేషన్‌ నీట్‌ పీజీృ2018 ఫలితాలను శుక్రవారం విడుదల చేసింది. రాష్ట్రాల వారీగా ర్యాంకుల జాబితాలను రెండు మూడు రోజుల్లో సిద్ధం చేయనుంది. అల్లోపతి, ఆయుష్, నర్సింగ్, ఫిజియోథెరపీ అన్ని కోర్సులు కలిపి రాష్ట్రంలో మొత్తం 2,262 పీజీ వైద్య సీట్లు ఉన్నాయి. ప్రభుత్వ కాలేజీల్లో 805, ప్రైవేటు కాలేజీల్లో 1,451 సీట్లున్నాయి. అల్లోపతి వైద్య విద్య పీజీ సీట్లు రాష్ట్రంలో 1,405 ఉన్నాయి. వీటిలో 683 సీట్లు ప్రభుత్వ కాలేజీల్లోనే ఉన్నాయి.

రాష్ట్రంలో ఈసారి 6 పీజీ వైద్య విద్య సీట్లు పెరిగాయి. గాంధీ వైద్య కాలేజీకి కొత్తగా 3 హాస్పిటల్‌ అడ్మినిస్ట్రేషన్‌ సీట్లను ప్రారంభించేందుకు అనుమతిచ్చింది. నిజామాబాద్‌లోని ప్రభుత్వ వైద్య కాలేజీలో కొత్తగా 3 పీజీ సీట్లను ఫార్మ కాలజీ (ఔషధ) విభాగంలో కేటాయించింది. 2018ృ 19 విద్యా సంవత్సరంలో ఈ కొత్త సీట్లను భర్తీ చేయనున్నారు. రాష్ట్రాల వారీగా ర్యాంకుల జాబితా అందగానే సీట్ల భర్తీ కోసం కాళోజీ వర్సిటీ నోటిఫికేషన్‌ జారీ చేయనుంది.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top