ఎడ్లబండే 108 

People worried About No Facilities In Mallengi Mandal - Sakshi

సాక్షి, నార్నూర్‌ (ఆసిఫాబాద్‌) : మండలంలోని మల్లెంగి గ్రామ పంచాయతీ పరిధిలోని బారిక్‌రావుగూడ  గ్రామానికి కనీసం రోడ్డు సౌకర్యం కూడా లేదు. ఎన్నికలప్పుడు అధికారులు, పాలకులు ఇచ్చిన హా మీలు నీటిమూటలుగానే మిగిలాయి. గిరిజనుల గోడును పట్టించుకునే నాథుడే కరువయ్యాడు. రోడ్డు సౌకర్యం కల్పించాలని జిల్లా కలెక్టర్, ఐటీడీ ఏపీవో, స్థానిక పాలకులకు విన్నవించినా.. పట్టించుకోవడం లేదని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గ్రామానికి కనీసం రోడ్డు సౌకర్యం లేకపోవడంతో అత్యవసర వాహనం 108 అం బులెన్స్‌ రాలేని పరిస్థితి నెలకొంది. గ్రామంలో ఎ వరికైన జ్వరం వచ్చిన లేదా అనారోగ్యానికి గురైన ఎడ్ల బండిలో వాగు దాటాల్సిందేనని  వాపోతున్నారు. బారిక్‌రావుగూడ గ్రామానికి రోడ్డు మా ర్గం సరిగా లేకపోవడంతో దాదాపు 5 కిలో మీటరు కాలినడకన మల్లెంగి గ్రామానికి చేరుకోలి. గ్రామం బాహ్య ప్రపంచానికి దూరంగా ఉంటుంది. ఆటోలు, 108 అంబులెన్స్‌లు రాలేని పరిస్థితి ఉందని గ్రామ పటల్‌ బారిక్‌రావు తెలిపారు. ఇప్పటికైనా బారిక్‌రావుగూడ వాగుపై వంతెన నిర్మించాలని గ్రామస్తులు కోరుతున్నారు. 

ఆరచేతిలో ప్రాణాలు..  
కాన్పు సమయంలో అందుబాటులో రవాణా సౌకర్యం లేకపోవడంతో ఏ రాత్రైనా ఎడ్ల బండిపై నార్నూర్‌ ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లాల్సిందే. ఇప్పటి వరకు గ్రామంలో చాలా మంది గర్భిణులు ఇబ్బందిపడ్డారు.  దాదాపు 12కిలో మీటర్లు ఎడ్ల బండిలో ప్రయాణించడం వలన అనారోగ్యానికి గురి కావడంతో పాటు ప్రాణాలను ఆరచేతిలో పెట్టుకొని కాలం వెళ్లాదిస్తున్నారు. వర్షా కాలం వాగులో వరద నీరు భారీగా చేరడంతో రా కపోకలకు అంతరాయం ఏర్పాడుతోంది. ఖరీప్‌ సాగు పనులకు అవసరమయ్యే సరకులను ముందే విత్తనాలు, వస్తువులను ప్రజలు తెచ్చుకొని పెట్టుకుంటారు.  అత్యవసర సమయంలో తాడు సహాయంతో వాగు దాటాల్సిందే.  

పట్టించుకోని అధికారులు, ప్రజాప్రతినిధులు..  
గ్రామ సమస్యలను జిల్లా కలెక్టర్, ఐటీడీఏ పీవో, పాలకుల దృష్టికి తీసుకెళ్లినా.. పట్టించుకోవడం లే దు. గ్రామానికి రోడ్డు సౌకర్యం కల్పిస్తే సమస్యలు పరిష్కారం అవుతాయని గ్రామస్తులు చెబుతున్నా రు. ఇప్పటికైనా అధికారులు, పాలకులు గ్రామానికి రోడ్డు సౌకర్యం కల్పించాలని ప్రజలు కోరుతున్నారు.  

వంతెన నిర్మించాలి 
బారిక్‌రావుగూడలో దాదాపు 150 కుటుంబాలు ఉంటాయి. కనీసం రోడ్డు లేదు. వాగుపై వంతెన లేకపోవడంతో ఇబ్బంది పడుతున్నాం. వర్షకాలంలో పరిస్థితి మరీ దారుణం. జిల్లా కలెక్టర్, ఎమ్మెల్యేలు స్పందించి సౌకర్యాలు కల్పించాలి.  
 – పూసం రూపాబాయి, సర్పంచ్, మల్లెంగి 

ఎండ్ల బండే దిక్కు 
గ్రామంలో జ్వరం వచ్చి నా.. గర్భిణులకు పురిటి నొ ప్పులు వచ్చినా.. గ్రామానికి రోడ్డు లేకపోవడంతో అంబులెన్స్‌ రాదు. ఎండ్ల బండిపైనే ఆస్పత్రికి తీసుకెళ్లాలి. అధికారులకు చెప్పినా పట్టించుకో వడం లేదు. రోడ్డు లేక చాలా గోసైతాంది.  
– నాగు, బారిక్‌రావుగూడ 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top