వార్తా పత్రికలకు పీసీఐ సూచన 

Pay The Fee For The PCI In Online - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : ప్రెస్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా (పీసీఐ)కు వార్తాపత్రికలు, ఏజెన్సీలు చెల్లించే మొత్తాన్ని ఆన్‌లైన్‌ ద్వారానే చెల్లించాలని పీసీఐ సూచించింది. ఆ మొత్తాన్ని  Sabpaisa& Allbank Qwikcollect లింకు ద్వారా అలహాబాద్‌ బ్యాంకు అకౌంటు నంబర్‌కు చెల్లించాలని పేర్కొంది. ఆన్‌లైన్‌ లింకు, ఇతర చెల్లింపు వివరాలను  http://presscouncil.nic.in వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచినట్లు శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపింది. ప్రతి వార్తా పత్రికకు శాశ్వత యూనిక్‌ ఐడీని కేటాయిస్తామని, దాని ద్వారా చెల్లింపులు జరపాలని పేర్కొంది. ఆఫ్‌లైన్‌ ద్వారా స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా ఖాతాలను వెంటనే నిలిపేస్తున్నట్లు వెల్లడించింది.  

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top