
హైదరాబాద్: పాస్‌పోర్ట్ సేవలను మరింత సరళీకృతం చేసే ప్రయత్నాల్లో భాగంగా హైదరాబాద్ పాస్‌పోర్ట్ సేవా కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. 60 ఏళ్లు పైబ డిన సీనియర్ సిటిజన్స్, ఐదేళ్లలోపు చిన్నారుల పాస్‌పోర్ట్/పీసీసీ/జీఈపీ దరఖాస్తుల స్వీకరణలో మార్పులు చేశారు. నిర్దేశిత కార్యాలయ పనివేళల్లో ఎప్పుడైనా ఆయా వయసుల వారి నుంచి దరఖాస్తులను నేరుగా స్వీకరిస్తామని రీజినల్ పాస్‌పోర్ట్ ఆఫీసర్ ఇ.విష్ణువర్ధన్‌రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు.
అప్లికేషన్ రిఫరెన్స్ నంబర్ షీట్‌తో పాటు అవసరమైన ధ్రువీకరణ పత్రాలతో హైదరాబాద్‌లోని పాస్‌పోర్ట్ సేవా కేంద్రాల్లో ఎక్కడైనా సమర్పించవచ్చన్నారు. అద్దెకుండే వారు తమ నివాస ధ్రువీకరణను తెలియజేస్తూ ‘రెంటల్ అగ్రిమెంట్’ పత్రాన్ని సమర్పించవచ్చన్నారు. దరఖాస్తు సమయంలో తీసుకునే వేలిముద్రల స్కానింగ్ నుంచి దివ్యాంగులు, ఐదేళ్ల కంటే తక్కువ వయసున్న పిల్లలను మినహాయించినట్లు పేర్కొన్నారు.