‘పంచాయతీ’లో బీసీ రిజర్వేషన్లు తగ్గొద్దు

In the Panchayat elections BC Reservations ranged from 34% to 23% - Sakshi

సీఎం కేసీఆర్‌కు 14 బీసీ సంఘాల విజ్ఞప్తి

హైదరాబాద్‌: పంచాయతీ ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లను 34% నుంచి 23%కు తగ్గకుండా సీఎం కేసీఆర్‌ చొరవ తీసుకోవాలని 14 బీసీ సంఘాలు విజ్ఞప్తి చేశాయి. విద్యానగర్‌ బీసీభవన్‌లో శనివారం జరిగిన 14 బీసీ సంఘాల సమావేశంలో బీసీ సంక్షేమ సంఘం నేత ఆర్‌.కృష్ణయ్య పాల్గొని ప్రసంగించారు. సుప్రీంకోర్టు, హైకోర్టు బీసీ రిజర్వేషన్లకు వ్యతిరేకంగా తీర్పులు ఇస్తున్నందున దీనికి రాజ్యాంగ సవరణ చేయడమే శాశ్వత పరిష్కారమన్నారు. ఇందుకోసం టీఆర్‌ఎస్‌ ఎంపీల ద్వారా కేంద్రంపై సీఎం కేసీఆర్‌ ఒత్తిడి పెంచి రాజ్యాంగ సవరణ బిల్లు ప్రవేశపెట్టాలని కోరారు. సీఎం అ«ధ్యక్షతన అఖిలపక్షాన్ని ఢిల్లీకి తీసుకెళ్లి ప్రధాని మోదీని కలిసి రాజ్యాంగ సవరణకోసం చొరవ తీసుకోవాలని కోరారు.

బీసీ రిజర్వేషన్లు జనాభా ప్రకారం 34% నుంచి 56%కు పెంచాలని బీసీలు డిమాండ్‌ చేస్తుంటే కోర్టులు, ప్రభుత్వాలు మాత్రం 34% నుంచి 23%కు తగ్గించడం సరికాదన్నారు.  సీఎం కేసీఆర్‌కు అభినందనలు తెలంగాణ ముఖ్యమంత్రిగా రెండోసారి బాధ్యతలు చేపట్టిన కేసీఆర్‌కు బీసీ సంఘాల సమావేశం అభినందనలు తెలిపింది. ఈసారైనా బీసీల విద్య, ఉద్యోగ, ఆర్థిక, రాజకీయ అభివృద్ధికి చర్యలు తీసుకుంటారని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో బీసీ సంక్షేమ సంఘం తెలంగాణ అ«ధ్యక్షుడు ఎర్ర సత్యనారాయణ, బీసీ నేతలు సి.రాజేందర్, మల్లేశ్‌యాదవ్, నీల వెంకటేశ్, టీఆర్‌.చందర్‌ పాల్గొన్నారు. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top