రెవెన్యూ పోరు | Outsourcing workers' strike | Sakshi
Sakshi News home page

రెవెన్యూ పోరు

Jul 6 2015 1:10 AM | Updated on Sep 3 2017 4:57 AM

రెవెన్యూ పోరు

రెవెన్యూ పోరు

దీర్ఘకాలిక సమస్యలు పరిష్కరించాలనే డిమాండ్‌తో రెవెన్యూ ఉద్యోగులు పోరుబాట పట్టారు.

నేటి నుంచి పురపాలక, మునిసిపాలిటీల్లో  ఔట్‌సోర్సింగ్ కార్మికుల  సమ్మె
 
నేటి నుంచి వర్‌‌క టూ రూల్ ఉదయం 10.30 నుంచి సాయంత్రం 5 గంటల వరకే విధులు కలెక్టర్ కరుణతో జేఏసీ నేతల భేటీసమస్యలు  పరిష్కరించే  వరకూ అంతేనన్న  నేతలు
 
హన్మకొండ అర్బన్ : దీర్ఘకాలిక సమస్యలు పరిష్కరించాలనే డిమాండ్‌తో రెవెన్యూ ఉద్యోగులు పోరుబాట పట్టారు. తొలిదశ ఆందోళనలో భాగంగా జిల్లాలో సోమవారం నుంచి వర్క్ టు రూల్ అమలు చేయాలని నిర్ణయించా రు. జిల్లాలోని అన్ని రెవెన్యూ కార్యాలయాల్లో డీఆర్వో నుంచి తహసీల్దార్  వరకు ఉదయం 10.30 నుంచి సాయంత్రం 5  గంటల వరకు మాత్రమే విధులు నిర్వర్తించాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు ట్రెస్సా, తహసీల్దార్ల సంఘం, వీఆర్‌ఏల సంఘం సంయుక్తంగా జేఏసీగా ఏర్పడ్డారు. రాష్ట్ర జేఏసీ నిర్ణయంతోపాటు జిల్లాలో చేపట్టనున్న తమ కార్యాచరణను ఆదివారం కలెక్టర్ వాకాటి కరుణను కలిసి వివరించారు. తమ డిమాండ్ల విషయంలో ప్రభుత్వం సానుకూలంగా స్పందించే వరకూ వర్క్ టూ రూల్ కార్యక్రమం కొనసాగుతుందని తే ల్చిచెప్పారు. ఈ సందర్భంగా జేఏసీ నేతలు మాట్లాడుతూ 1985లో మండలాల వ్యవస్థ ఏర్పడ్డప్పటి లెక్కల ప్రకారం కార్యాలయం అధికారులు, సిబ్బంది పోస్టులే ఉన్నాయని తెలిపారు.

ఆ పోస్టుల్లో కూడా ప్రసుత్తం చాలా వరకు ఖాళీలు ఏర్పడ్డాయని, వాటిని భ ర్తీ చేయక పోవడం, పోస్టుల సంఖ్య పెంచకపోవడం వల్ల పరిపాలనా పరంగా ఇబ్బందులు ఎదురవుతున్నాయని... అధికారులు, సిబ్బందిపై తీవ్ర పనిభారం పడుతోందన్నారు. నెలల కాలంగా డీటీలకు పదోన్నతులు లేవని.. ఉన్న స్థానం నుంచే ఉద్యోగ విరమణ చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తహసీల్దార్లకు వాహనాలు కేటాయిస్తామని ఇచ్చిన హామీని నెరవేర్చాలని, వీఆర్‌ఏలకు కనీస వేతనాలు ఒక్కొక్కరికి రూ.13 వేలు 101పద్దు ద్వారా చెల్లించాలని కోరారు. కలెక్టర్‌ను కలిసిన వారిలో ట్రెస్సా జిల్లా అధ్యక్షుడు మార్గం కుమారస్వామి, తహసీల్దార్ల సంఘం జిల్లా అధ్యక్షులు పూల్‌సింగ్ చౌహాన్, రాష్ట్ర నాయకులు చెన్నయ్య, ట్రెస్సా కార్యదర్శి రాజ్‌కుమార్, రత్నవీరాచారి, వీఆర్‌ఏల సంఘం జిల్లా అధ్యక్షులు రాకేష్, వీఆర్‌ఓల సంఘం నాయకులు పాల్గొన్నారు.
 
సాయంత్రం 5 గంటలకే బంద్...
 జిల్లా వ్యాప్తంగా తహసీల్దార్,ఆర్డీవో కార్యాలయాలకు సోమవారం నుంచి సాయంత్రం 5 గంటలకే తాళాలు పడనున్నాయి. తహసీల్దార్ నుంచి వీఆర్‌ఏ వరకు ప్రతి ఒక్కరూ వర్క్ టు రూల్ కార్యక్రమంలో పాల్గొంటున్న నేపథ్యంలో పరిపాలనా పరమైన ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది.

రెవెన్యూ ఉద్యోగుల ప్రధాన డిమాండ్లు..
పెండింగ్‌లో ఉన్న సమస్యలు పరిష్కరించాలి.
{పొటోకాల్ కోసం నిధులు పెంచాలి.
కాంటింజెన్సీ నిధులు పెంచాలి.
మండలాలు, రెవెన్యూ డివిజన్ల విభజన చేయాలి.
జనాభాకు తగ్గట్టు ఉద్యోగుల సంఖ్యను పెంచాలి.
ఖాళీలు వెంటనే భర్తీ చేయాలి.
కార్యాలయాల్లో మౌలిక సదుపాయాలు కల్పించాలి.
డీటీలు, వీఆర్వోలకు పదోన్నతులు కల్పించాలి.
వీఆర్‌ఓలకు ఎఫ్‌టీఏ ఇవ్వాలి.
తహసీల్దార్లకు వాహన సౌకర్యం కల్పించాలి.
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement