రూ.వేల కోట్లతో బాన్సువాడ అభివృద్ధి : పోచారం శ్రీనివాస్‌రెడ్డి

One Lakh Rupees Development On Banswada In Nizamabad - Sakshi

రైతుల సంక్షేమమే ధ్యేయంగా పని చేస్తా 

నిరుపేదలందరికీ డబుల్‌ బెడ్‌రూం ఇళ్లు నిర్మిస్తా 

మౌలిక వసతులన్నీ కల్పిస్తా 

‘సాక్షి’తో మంత్రి  పోచారం శ్రీనివాస్‌రెడ్డి 

సాక్షి, బాన్సువాడ: ‘గత నాలుగున్నరేళ్లలో రూ.వేల కోట్లతో బాన్సువాడ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేశా.., వ్యవసాయమే ప్రధాన వృత్తిగా ఉన్న ఈ నియోజకవర్గంలో 2 లక్షల ఎకరాలకు సాగునీరందించేందుకు కాళేశ్వరం ద్వారా నిజాంసాగర్‌లో ఏడాది పొడవునా నీరు అందుబాటులో ఉండేలా పనులు చేయిస్తున్నా.. నిరుపేదలందరికీ వచ్చే ఏడాదిలోగా డబుల్‌ బెడ్‌రూం ఇండ్లు నిర్మించి ఇస్తా.. సీసీ రోడ్లు, ఆర్‌అండ్‌బీ రోడ్లు, డ్రెయినేజీలు, ఆస్పత్రులు ఇలా అన్ని సౌకర్యాలను కల్పిస్తా..’ అని రాష్ట్ర మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి వెల్లడించారు.  మంగళవారం ఆయన ‘సాక్షి’తో ప్రత్యేకంగా ముచ్చటించారు.

 నియోజకవర్గంలో తాగు, సాగునీరు, రోడ్లు, డ్రెయినేజీలు, విద్య, ఉపాధి రంగాల ను మెరుగు పర్చాం. రూ.230 కోట్లతో మిషన్‌ భగీరథ పనులు కొనసాగుతున్నాయి. ఇంటింటికీ నల్లా కనెక్షన్లు ఉచితంగా అందిస్తున్నాం.  పారిశ్రా మికాభివృద్ధికి సీఎం కేసీఆర్, ప్రత్యేకంగా కేంద్ర ప్రభుత్వంతో చర్చించి బాలానగర్‌–మెదక్‌–బాన్సువాడ–బోధన్‌–భైంసా వరకు జాతీయ ర«హదారిని మంజూరు చేయించారు. ఇప్పటికే మెద క్‌ వరకు రూ.500 కోట్లతో రహదారిని విస్తరిస్తు న్నారు. మెదక్‌ నుంచి రుద్రూర్‌ వరకు మరో రూ. 600 కోట్లతో నాలుగు లైన్ల రోడ్డుగా అభివృద్ధి చేస్తాం. రూ.266 కోట్లతో ఆర్‌అండ్‌బీ రోడ్లు, రూ.273 కోట్లతో పంచాయతీరాజ్‌ రోడ్లు వేయించాం. నేడు బాన్సు వాడ నుంచి అన్ని మండలాలకు డబుల్‌ రోడ్లు వేశాం. ఇంటర్, డిగ్రీ కళాశాలల అభివృద్ధికి రూ. 5.84 కోట్లు, పాలిటెక్నిక్‌ కళాశాల కోసం రూ.2.77 కోట్లు, రుద్రూర్‌లో ఫుడ్‌ టెక్నాలజి కళాశాల కోసం రూ.14 కోట్లు మంజూ రు చేసి నిర్మించాం.

ఎస్సీ, ఎస్టీ   హాస్టళ్ల నిర్మాణం కోసం రూ.11.9 కోట్లు, మిషన్‌ కాకతీయ ద్వారా 65 చెరువుల ఆ«ధునీకరణకు రూ.93.4 కోట్లు, లిఫ్ట్‌ ఇరిగేషన్‌ పథకాల కోసం రూ.14.5 కోట్లు మంజూ రు చేశాం. నిజాంసాగర్‌ కాలువ ఆధునీకరణ కోసం రూ.30 కోట్లు, హార్టికల్చర్‌ కోసం రూ.5.01 కోట్లు, ఆర్‌డబ్ల్యూఎస్‌ పనుల కోసం రూ.99.66 కోట్లు, వ్యవసాయ రంగాభివృద్ధికి రూ.11 కోట్లు, గోదాంల నిర్మాణాలకు రూ.10 కోట్లు, విద్యుత్‌ సబ్‌ స్టేషన్ల నిర్మాణాలకు రూ.16 కోట్లు మంజూరు చేశాం. వైద్య ఆరోగ్యశాఖ ఆస్పత్రులు నిర్మాణాలకు రూ.30 కోట్లు, బాన్సువాడలో వంద పడకల ప్రసూతి ఆస్పత్రి నిర్మాణానికి రూ.17 కోట్లు, పాల శీతలీకరణ కేంద్రం కోసం రూ.2 కోట్లు మం జూరు చేశాం. కొల్లూరు వంతెన నిర్మాణానికి రూ. 2 కోట్లు, బీర్కూర్‌ శివారులో తిరుమల తిరుపతి దేవస్థానానికి రూ.13 కోట్లు మంజూరు చేయించి, తెలంగాణలోనే ప్రముఖ పుణ్యక్షేత్రంగా తీర్చి దిద్దుతున్నాం. మసీదులు, దర్గాలు, శ్మశానవాటికలకు రూ.10కోట్ల వరకు మంజూరు చేయించాం.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top