రెండు బైకులు ఢీ.. ఒకరి మృతి | one dies of the two bikes collided .. | Sakshi
Sakshi News home page

రెండు బైకులు ఢీ.. ఒకరి మృతి

Apr 2 2015 9:20 AM | Updated on Aug 25 2018 6:22 PM

కొడుకు బాగోగులు తెలుసుకుందామని పాఠశాలకు వెళ్తున్న వ్యక్తి ప్రమాదవశాత్తు మృతిచెందిన సంఘటన మహబూబ్‌నగర్ జ్లిలా బిజినేపల్లిలో గురువారం ఉదయం చోటుచేసుకుంది.

మహబూబ్‌నగర్ (బిజినేపల్లి): కొడుకు బాగోగులు తెలుసుకుందామని పాఠశాలకు వెళ్తున్న వ్యక్తి ప్రమాదవశాత్తు మృతిచెందిన సంఘటన మహబూబ్‌నగర్ జ్లిలా బిజినేపల్లిలో గురువారం ఉదయం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో గద్వాల్‌కు చెందిన లక్ష్మన్న(42) అక్కడికక్కడే మృతిచెందాడు. నవోదయ పాఠశాలలో చదువుతున్న తన కొడుకు వద్దకు వెళ్తున్న లక్ష్మన్న బిజినేపల్లి, వట్టెమ్ రహదారిలోని నవోదయ కమాన్ వద్ద మూల మలుపు తిరుగుతుండగా వెనుక నుంచి వస్తున్న మరో ద్విచక్రవాహనం ఢీ కొట్టింది. దీంతో లక్ష్మన్న అక్కడికక్కడే మృతిచెందగా.. మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని క్షతగాత్రులను 108లో ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.

Advertisement
 
Advertisement
Advertisement