ఆటో, వ్యాను ఢీ: ఒకరి మృతి | one dies in auto-van accident at khammam district | Sakshi
Sakshi News home page

ఆటో, వ్యాను ఢీ: ఒకరి మృతి

Oct 1 2015 10:29 PM | Updated on Apr 3 2019 7:53 PM

చనిపోయిన తమ కుటుంబ పెద్ద అస్తికలను గోదావరి నదిలో కలిపేందుకు వెళ్తుండగా జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు అసువులు బాశారు.

టేకులపల్లి(ఖమ్మం): చనిపోయిన తమ కుటుంబ పెద్ద అస్తికలను గోదావరి నదిలో కలిపేందుకు వెళ్తుండగా జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు అసువులు బాశారు. వివరాలు.. ఖమ్మం టేకులపల్లి మండలం బేతంపూడి గ్రామానికి చెందిన కాకటి ఎల్లయ్య ఇటీవల చనిపోయాడు. ఆయన అస్తికలను గోదావరిలో కలిపేందుకు కుటుంబసభ్యులు 11 మంది సొంత ఆటోలో భద్రాచలం బయలుదేరారు.

రాత్రి 9.30 గంటల సమయంలో వారి వాహనాన్ని మండలంలోని బొమ్మనపల్లి వద్ద ఇల్లెందు వైపు వేగంగా వస్తున్న డీసీఎం వ్యాన్ ఢీకొంది. ఈ ఘటనలో కాకటి సుశీల(40) అక్కడికక్కడే మృతి చెందగా మరో ముగ్గురికి తీవ్రంగాను, ఏడుగురికి స్వల్పంగా గాయాలయ్యాయి. క్షతగాత్రులను 108లో కొత్తగూడెం ఏరియా ఆస్పత్రికి తరలించారు.

Advertisement
 
Advertisement
Advertisement