ఆటో బోల్తా : ఒకరు మృతి | One dies as auto overturns | Sakshi
Sakshi News home page

ఆటో బోల్తా : ఒకరు మృతి

Nov 16 2015 5:54 PM | Updated on Sep 3 2017 12:34 PM

నల్లగొండ జిల్లా మర్రిగూడ మండలం ఖుదాభక్షిపల్లి వద్ద ఆటో బోల్తా పడి ఒకరు మృతి చెందగా, మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి.

మర్రిగూడ : నల్లగొండ జిల్లా మర్రిగూడ మండలం ఖుదాభక్షిపల్లి వద్ద ఆటో బోల్తా పడి ఒకరు మృతి చెందగా, మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. సోమవారం సాయంత్రం హైదరాబాద్ వైపు నుంచి ఓ ఆటో వెళ్తుండగా...మరో వాహనం అడ్డు వచ్చేసరికి ఆటో డ్రైవర్ ఒక్కసారిగా బ్రేక్ వేశాడు. దీంతో ఆటో అదుపుతప్పి బోల్తాకొట్టింది.

ఆటోలో ప్రయాణిస్తున్న రమావత్ ఖేరి (55) అనే మహిళ తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతి చెందింది. జాను, దాలి, దత్తు అనే వారికి తీవ్ర గాయాలు కావడంతో మర్రిగూడ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మెరుగైన చికిత్స కోసం వారిని నల్లగొండకు రిఫర్ చేశారు.
 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement