టీచర్‌ పోస్టుల భర్తీకి నేడు నోటిఫికేషన్‌! | Notification for Teacher posts in Telangana | Sakshi
Sakshi News home page

టీచర్‌ పోస్టుల భర్తీకి నేడు నోటిఫికేషన్‌!

Oct 21 2017 2:06 AM | Updated on Oct 21 2017 3:40 AM

Notification for Teacher posts in Telangana

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి అవసరమైన టీచర్‌ రిక్రూట్‌మెంట్‌ టెస్టు (టీఆర్‌టీ) నోటిఫికేషన్‌ జారీకి రంగం సిద్ధమైంది. నేడు నోటిఫికేషన్‌ జారీ చేసేందుకు టీఎస్‌పీఎస్సీ ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిసింది. నేడు జరిగే కమిషన్‌ సమావేశంలో చర్చించిన తర్వాత నోటిఫికేషన్‌ జారీ చేయనున్నట్లు సమాచారం. సిలబస్, అర్హతలు, పోస్టులు, రోస్టర్‌ తదితర అంశాలన్నింటినీ శుక్రవారం ఖరారు చేసినట్లు తెలిసింది.

దీంతో శనివారం మధ్యాహ్నం తర్వాత నోటిఫికేషన్‌ జారీ చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఇందులో మొదట 8,792 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేయనున్నట్లు తెలిసింది. సోమవారం టీచర్‌ పోస్టుల భర్తీకి సంబంధించిన కేసు విచారణకు రానున్నందున సుప్రీంకోర్టుకు ఈ నోటిఫికేషన్‌ కాపీని అందజేయనున్నట్లు సమాచారం.

ఇంగ్లిషు తప్పనిసరి నేపథ్యంలో..
ఈ నోటిఫికేషన్‌ ద్వారా కొత్తగా 500 వరకు ఇంగ్లిషు మీడియం సెకండరీ గ్రేడ్‌ టీచర్‌ పోస్టులను భర్తీ చేయనున్నట్లు తెలిసింది. రాష్ట్రంలో ఒకటో తరగతి నుంచి ఇంగ్లిషు సబ్జెక్టును తప్పనిసరి చేయడంతోపాటు ప్రీప్రైమరీ దశలోనూ ఇంగ్లిషు మీడియం ప్రారంభించేందుకు విద్యాశాఖ చర్యలు చేపట్టింది. గతేడాది, ఈసారి కలిపి దాదాపు 8 లక్షల మంది వరకు ఇంగ్లిషు మీడియంలో చేరారు. వారికి బో«ధించేందుకు ఇంగ్లిషు మీడియం పోస్టులను భర్తీ చేసేందుకు చర్యలు చేపట్టినట్లు తెలిసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement