టీ. అసెంబ్లీలో సీమాంధ్ర సిబ్బంది వద్దు | no seemandhra staff in telangana assembly | Sakshi
Sakshi News home page

టీ. అసెంబ్లీలో సీమాంధ్ర సిబ్బంది వద్దు

May 24 2014 12:46 AM | Updated on Sep 2 2017 7:45 AM

తెలంగాణ శాసనసభ సచివాలయంలో సీమాంధ్ర ఉద్యోగులు పనిచేయడాన్ని తాము వ్యతిరేకిస్తున్నామని తెలంగాణ ఉద్యోగుల సంఘం నేత వేణుగోపాల్ తెలిపారు.

సాక్షి, హైదరాబాద్: తెలంగాణ శాసనసభ సచివాలయంలో సీమాంధ్ర ఉద్యోగులు పనిచేయడాన్ని తాము వ్యతిరేకిస్తున్నామని తెలంగాణ ఉద్యోగుల సంఘం నేత వేణుగోపాల్ తెలిపారు. తెలంగాణ శాసనసభకు కేటాయించిన సిబ్బందిలో సీమాంధ్ర ఉద్యోగులున్న విషయాన్ని ఆధారాలతోసహా  శాసనసభ కార్యదర్శి రాజా సదారాంకు సమర్పించామన్నారు. మరికొంత సమయమిస్తే మరిన్ని ఆధారాలు సమర్పిస్తామని చెప్పారు. తెలంగాణ శాసనసభకు 185 మంది అధికారులు, 210 మంది నాలుగో తరగతి సిబ్బందిని కేటాయించగా, వారిలో 80 మందికిపైగా సీమాంధ్రులున్నారని చెప్పారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement