విత్తనాల కొరత లేదు


    ఎరువులు అందుబాటులో ఉన్నాయి

     కృత్రిమ కొరత సృష్టిస్తే కఠిన చర్యలు

     ఖరీఫ్ రైతులు ఆందోళన చెందవద్దు

     శాస్త్రీయంగా భూసార పరీక్ష పత్రాలు

     సేంద్రియ ఎరువుల వాడకంపై అన్నదాతలకు అవగాహన

     ఈ నెలాఖరులోగా రెండో విడత రుణమాఫీ అందుతుంది

     'సాక్షి'తో వ్యవసాయ శాఖ జాయింట్ డెరైక్టర్ డి. నర్సింహా


 సాక్షి ప్రతినిధి, నిజామాబాద్:

 మృగశిర, ఆరుద్ర కార్తెల ప్రభావం మొదలైంది. గతేడాదితో పోలిస్తే ఈసారి వానల జోరు పెరిగింది. ఈ నేపథ్యంలో రైతులు సాగుకు సన్నద్ధమయ్యూరు. ఖరీఫ్ పనులు వేగం పుంజుకున్నాయి. ఎరువులు, విత్తనాల సరఫరాపైనే అనుమానాలు. వ్యవసాయ పనిముట్లు, రుణమాఫీ, యంత్రలక్ష్మి పథకాలపై అనేక సందేహాలు నెలకొన్నాయి. భూసార పరీక్ష లు మొదలు పంటల సాగు వరకు అనేక అంశాలు ప్రాధాన్యంగా మారాయి. ఈ నేపథ్యంలో వ్యవసాయశాఖ సంయుక్త సంచాలకులు ఎం.నర్సిం హాసింహా 'సాక్షి'ఇంటర్వ్యూలో పలు విషయాలు వెల్లడించారు. అనుమానాలను నివృత్తి చేయడంతోపాటు, రైతులకు పలు సూచనలు, సలహాలు ఇచ్చారు. వివరాలు ఆ యన మాటలలోనే...

 విత్తనాలు, ఎరువుల కొరత లేదు...

 ఈ విషయంలో అపోహలు వద్దు

 ఖరీఫ్‌కు రైతులు విత్తనాలు, ఎరువుల విషయంలో ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. సీజన్‌కు సరి పడే విధంగా ఎరువులు, విత్తనాలు సరఫరా చేసేం దుకు వీలుగా అన్ని చర్యలు తీసుకున్నాం. 1,04,550 క్వింటాళ్ల జీలుగ, సోయాచిక్కుడు, మొక్కజొన్న తది తర విత్తనాలను సబ్సిడీపై రైతులకు అందజేస్తున్నా ము. 75,000 పత్తి ప్యాకెట్లు అందుబాటులో ఉంచాం. ఈ సీజన్ కోసం 234303 మెట్రిక్ టన్నుల యూ   రియా, డీఏపీ, కాంప్లెక్స్ తదితర రకాల ఎరువులను సరఫరా చేయనున్నాం. 1,02, 809 మె.టన్నుల ఎరువులు మార్క్‌ఫెడ్ ద్వారా ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘా(ప్యాక్స్)లకు సరఫరా చేశాం. విత్తనాలు, ఎరువుల కృత్రిమ కొరతను సృష్టించే వారిపై కఠినచర్యలు తీసుకుంటాం.

 ఖరీఫ్ సాగు అంచనా 4.18 లక్షల హెక్టార్లు

 2013, 2014 ఖరీఫ్ సీజన్‌ల సాగును దృష్టిలో పెట్టుకుని ఈసారి ఖరీఫ్ సాగును అంచనా వేశాము. 4,18,100 హెక్టార్లలో వివిధ పంటలు వేస్తారనుకున్నాం. అత్యధికంగా సోయా, వరి పంటలు మూడు లక్షల హెక్టార్ల వరకు ఉండవచ్చు. ఈసారి అటవీశాఖ ఆక్రమిత భూముల విషయంలో సీరియస్‌గా వ్యవహరిస్తున్నందున సుమారు 20 వేల హెక్టార్లలో సాగు తగ్గే అవకాశం ఉంది. 3.98 లక్షల హెక్టార్లు అనుకు న్నా ఇప్పటి వరకు పరిస్థితులు అనుకూలంగా ఉండటంతో సోమవారం నాటికి జిల్లా వ్యాప్తంగా 1,14, 860 హెక్టార్లలో వివిధ పంటలు వేశారు. గతేడాదితో పోలిస్తే ఇప్పటి వరకు 21 శాతం వర్షపాతం ఎక్కువగా నమోదైనా, మిగతా జిల్లాలతో పోలిస్తే తక్కువే.

 ఆన్‌లైన్ ద్వారానే ఇక ‘యంత్రలక్ష్మి’ దరఖాస్తులు

 యంత్రలక్ష్మి పథకాన్ని మరింత పారదర్శకంగా అమలు చేసేందుకు ప్రభుత్వం ఈ ఏడాది నుంచి ఆన్‌లైన్ ద్వారా అర్హులైన రైతుల దరఖాస్తులు స్వీకరించనుంది. మ ండల వ్యవసాయాధికారి కార్యాలయంలో పూర్తి వివరాలు పొందవచ్చు. ఈ ఏడాది జిల్లాకు యంత్రలక్ష్మి కింద రూ.18.74 కోట్లు కేటాయించారు. 25 హెచ్‌పీ ట్రాక్టర్లు,రొ టవేటర్లు, మినీ ట్రాక్టర్లు, ట్రాలీలు, టార్పాలిన్లు, వ్యవసాయ సస్యరక్షణ పరికరాలు తదితర యంత్రాల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ఇకనుంచి వీటిని దరఖాస్తు చేసు కున్న వారం రోజులలోనే అందిస్తాం.

 మూడేళ్లలో భూములకు భూసార పరీక్ష పత్రాలు

 శాస్త్రీయ పద్ధతిలో భూసార పరీక్షలు నిర్వహించి రైతులకు పత్రాలు అందజేసే ప్రక్రియను ప్రభుత్వం కొత్తగా ప్రవేశపెట్టింది.మోతాదును మించి రసాయన ఎరువులు వాడటంతో చాలా చోట్ల భూసారం దెబ్బతిన్నది. ఇందుకోసం జిల్లాలోని భూములన్నింటినీ మూడు విడతలుగా మూడేళ్లలో పరీక్షలు నిర్వహించి శాస్త్రీయంగా వ్యవహరించే వీలు కల్పించనున్నాం. వర్షాధార పంటలు వేసే భూములైతే 10 హెక్టార్లు ఒక గ్రిడ్‌గా, బాబులు, ప్రాజెక్టుల కింద సాగయ్యే భూములైతే రెండున్నర హెక్టార్లు ఒక గ్రిడ్ పరిగణించి భూమి ఆరోగ్య పథకం కింద పరీక్షలు నిర్వహించి కార్డులు అందజేస్తాం. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు 'పరం పరాగత్' స్కీం ద్వారా గతంలో రసాయన ఎరువులు వాడిన భూములను 25 ఎకరాలను ఒక క్లస్టర్‌గా తీసుకొని సేంద్రియ ఎరువులపై రైతులందరికీ అవగాహన కల్పించనున్నాం.

 పకడ్బందీగా విత్తన గ్రామ పథకం

 ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న విత్తన గ్రామ పథకాన్ని జిల్లాలో పకడ్బందీగా అమలు చేస్తున్నాం. బోధన్, భిక్కనూర్, బిచ్కుంద మండలాలో మినుముల విత్తనాల కోసం ఆరు క్వింటాళ్లు సరఫరా చేశాము. 12 మండలాలలో 900 క్వింటాళ్ల వరి విత్తనాలు రైతులకు సరఫరా చేయగా, నారుమళ్లు కూడ సిద్ధం చేశారు. సోయా సీడ్ కోసం 3000 క్వింటాళ్లు లక్ష్యం కాగా, 2600 క్వింటాళ్లు సరఫరా చేశాము. వచ్చే ఏడాదిలో రైతులు ప్రరుువేటు కంపెనీలపై ఆధారపడే పరిస్థితి ఉండదు.రెండో విడత రుణమాఫీకి నిధులు విడుదల చేస్తూ ప్రభుత్వం జీఓ జారీ చేసింది. ఈ నెలాఖ రులోగా ఈ ప్రక్రియ పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నాం. దీంతో మరో రూ.393.40 కోట్ల రుణా లు రైతులకు మాఫీ కానున్నాయి.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top