తెలంగాణలో రెండో విడత కౌన్సెలింగ్ ఉండదు | No second stage of eamcet counselling in Telangana, says papireddy | Sakshi
Sakshi News home page

తెలంగాణలో రెండో విడత కౌన్సెలింగ్ ఉండదు

Sep 2 2014 1:22 PM | Updated on Apr 7 2019 3:35 PM

తెలంగాణలో రెండో విడత ఎంసెట్ కౌన్సిలింగ్ ఉండదని తెలంగాణ ఉన్నత విద్యామండలి ఛైర్మన్ పాపిరెడ్డి తెలిపారు.

హైదరాబాద్ : తెలంగాణలో రెండో విడత ఎంసెట్ కౌన్సిలింగ్ ఉండదని తెలంగాణ  ఉన్నత విద్యామండలి ఛైర్మన్ పాపిరెడ్డి తెలిపారు. ఆయన మంగళవారమిక్కడ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ ఉన్నత విద్యామండలి కౌన్సెలింగ్ ఏర్పాటు చేసినా తెలంగాణ ప్రభుత్వం అంగీకరించదన్నారు.  మేనేజ్మెంట్ కోటా సీట్ల విషయంలో ఏపీ ఉన్నత విద్యామండలి జోక్యం అవసరం లేదన్నారు.

తెలంగాణలో సీట్లు తామే భర్తీ చేసుకుంటామని పాపిరెడ్డి తెలిపారు. ప్రవేశాల ముఖ్య అధికారి రఘునాథ్ పదవి పొడిగింపుపై సంబంధం లేదన్నారు. తెలంగాణ ప్రాంతానికి చెందిన వ్యక్తినే ఇన్ఛార్జ్గా నియమించుకుంటామన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement