సమస్యల పరిష్కారం కోసం అర్చకులు, సిబ్బంది నేటి నుంచి సమ్మెలో పాల్గొంటున్నారు.
కరీంనగర్: సమస్యల పరిష్కారం కోసం అర్చకులు, సిబ్బంది మంగళవారం నుంచి సమ్మెలో పాల్గొంటున్నారు. నేటి నుంచి ఆలయాల్లో ఆర్జిత సేవలు నిలిపివేస్తున్నట్లు ధర్మపురిలోని శ్రీ లక్ష్మీనృసింహ స్వామి ఆలయం ప్రధాన అర్చకుడు రఘునాథా చార్యులు తెలిపారు. బాసర, వేములవాడ, యాదిగిరిగుట్ట, భద్రాచలంలోని ప్రధాన ఆలయాలు మినహా మిగతా ఆలయాలు, వాటి అనుబంధ ఆలయాల్లో అర్చకులతోపాటు సిబ్బంది విధులు బహిష్కరిస్తున్నారని ఆయన పేర్కొన్నారు. దీంతో ఆలయాల్లో ఎటువంటి పూజలు ఉండవని తెలిపారు.