
'పన్ను వసూళ్లలో వ్యాపారులను ఇబ్బంది పెట్టం'
తెలంగాణ ప్రభుత్వం శాస్త్రీయంగా పన్నులు వసూలు చేస్తోందని రాష్ట్ర వాణిజ్య పన్నుల శాఖ మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్ తెలిపారు.
హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం శాస్త్రీయంగా పన్నులు వసూలు చేస్తోందని రాష్ట్ర వాణిజ్య పన్నుల శాఖ మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్ తెలిపారు. గురువారం హైదరాబాద్లో ఆయన మాట్లాడుతూ... పన్ను వసూళ్ల కోసం వ్యాపారస్తులను ఇబ్బంది పెట్టమని ఆయన స్పష్టం చేశారు. పెట్రోల్, డీజిల్ ధరల్లో వ్యత్యాసాల కారణంగా ప్రభుత్వానికి రావాలసిన రాబడి కొంత తగ్గిన మాట వాస్తవమేనని తలసాని వెల్లడించారు.
కార్పొరేట్ ఆస్పత్రులకు నిర్దేశించిన విధంగా పన్నులు చెల్లించడం లేదన్నారు. ఆన్లైన్ వ్యాపారం, ఆన్లైన్ సినిమా టిక్కెట్లు విక్రయాలపై ప్రభుత్వం వద్ద సరైన సమాచారం లేదని ఆయన తెలిపారు. ఆన్లైన్ వ్యాపారాలన్ని పన్నుల వసూళ్లకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని తలసాని శ్రీనివాస యాదవ్ ఈ సందర్భంగా వివరించారు.