రేపు కరీంనగర్‌కు కొత్త రైలు!

New train to Karimnagar tomorrow - Sakshi

     నిజామాబాద్‌– లోకమాన్య తిలక్‌ రైలు కరీంనగర్‌ వరకు పొడిగింపు 

     26న ప్రారంభించనున్న దక్షిణ మధ్య రైల్వే

సాక్షి, హైదరాబాద్‌: చాలాకాలంగా కొత్త రైలు కోసం ఎదురుచూస్తున్న కరీంనగర్‌వాసులకు శుభవార్త. పట్టణానికి మరో కొత్త రైలు రాబోతోంది. ఇప్పటిదాకా నిజామాబాద్‌ వరకు నడిచిన నిజామాబాద్‌ – లోకమాన్య తిలక్‌ (ట్రెయిన్‌ నం 11206) రైలును కరీంనగర్‌ వరకు పొడిగించారు. ఈ నెల 26న మధ్యాహ్నం 3 గంటలకు రైలును ప్రారంభించేందుకు దక్షిణ మధ్య రైల్వే అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. 1994లో అప్పటి ప్రధాని పీవీ నర్సింహారావు హయాంలో స్టేషన్‌ పనులు మొదలయ్యాయి.పెద్దపల్లి నుంచి కరీంనగర్‌కు రైల్వే లైన్‌ పూర్తి కావడంతో 2001లో స్టేషన్‌ ప్రారంభమైంది. 2017 మార్చి 25 నాటికి నిజామాబాద్‌ వరకు లైన్‌ పూర్తవడంతో పెద్ద పల్లి–కరీంనగర్‌– నిజామాబాద్‌ మార్గంలో రైళ్ల రాకపోకలు మొదలయ్యాయి.

కరీంనగర్‌– తిరుపతి సూపర్‌ ఫాస్ట్‌ ఎక్స్‌ప్రెస్‌ (12762/12761), కాచిగూడ–కరీంనగర్‌ ప్యాసింజర్‌ ్కఅ   (57601/02), సిర్పూర్‌ టౌన్‌–కరీంనగర్‌ డెమూ (77255/77 256), కరీంనగర్‌ –లింగంపేట (జగి త్యాల) డెమూ (77274/77273), పెద్దపల్లి– లింగంపేట(జగిత్యాల) డెమూ (77258/77257), నిజామాబాద్‌ – కరీంనగర్‌ డెమూ (77260/77259) రైళ్లు రాకపోకలు సాగిస్తున్నాయి. కరీంనగర్‌ నుంచి నిజామాబాద్‌ వరకు రైల్‌ ప్రయాణ సౌకర్యం సాకారమైనా ప్రయాణికుల నుంచి పెద్దగా ఆదరణ లేదు. వాస్తవానికి ఈ రెండు నగరాల మధ్య రైలు చార్జీ కేవలం రూ.40. ఆర్టీసీ చార్జి రూ.200. అయినా ప్రయాణికులు ఎక్కువగా రైలును కాదని ఆర్టీసీలోనే ప్రయాణిస్తున్నారు. ఈ రైల్వేస్టేషన్లు ఊరికి దూరంగా ఉండటం, అక్కడ నుంచి పట్టణాలకు సరైన రవాణా సదుపాయం లేకపోవడమే దీనికి కారణం. తాజాగా నిజామాబాద్‌–లోకమాన్య తిలక్‌ కరీంనగర్‌ వరకు పొడిగించడం ఆశాజనకంగా మారింది. నిజామాబాద్‌తోపాటు బాసర, మహారాష్ట్రలోని నాందేడ్, ఔరంగాబాద్, మన్మాడ్, నాసిక్‌ తదితర ప్రాంతాలకు రైలులో ప్రయాణించే వీలు ఏర్పడింది.  

27న ఎంపీ వినోద్‌తో భేటీ..: ఈ నెల 27న ఎంపీ వినోద్‌కుమార్‌తో దక్షిణ మధ్య రైల్వే జీఎం వినోద్‌కుమార్‌ యాదవ్‌ భేటీ కానున్నారు. ఇటీవల పార్లమెం టు సమావేశాల అనంతరం ఎంపీలతో భేటీ అయి వారి నియోజకవర్గాల్లో ఉన్న రైల్వే పనుల పురోగతి, పెండింగ్‌ పనులపై చర్చించాలని కేంద్రమంత్రి పీయూష్‌ గోయల్‌ రైల్వే ఉన్నతాధికారులను ఆదేశిం చారు. ఇందులో భాగంగా ఇప్పటికే దక్షిణ మధ్య రైల్వే పరిధిలోని పలువురు ఎంపీలను కలిసిన రైల్వే జీఎం 27న ఎంపీ వినోద్‌తో సమావేశం కానున్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top