సీఐ సాహసం.. నెటిజన్ల ప్రశంసలు | Netizens applauds CI Srujanreddy for his bravery act | Sakshi
Sakshi News home page

సీఐ సాహసం.. నెటిజన్ల ప్రశంసలు

May 28 2019 6:16 PM | Updated on May 28 2019 6:29 PM

Netizens applauds CI Srujanreddy for his bravery act - Sakshi

కరీంనగర్‌ : కరీంనగర్‌ జిల్లా జమ్మికుంటలో ఓ సీఐ ప్రాణాలకు తెగించి ఇద్దరిని సురక్షితంగా కాపాడారు. మడిపల్లి గ్రామంలో చేపలు పట్టడానికి బావిలో దిగిన ఇద్దరు వ్యక్తులు ఆక్సిజన్ అందక బావిలోనే పడిపోయారు. విషయం తెలుసుకున్న జమ్మికుంట సీఐ సృజన్ రెడ్డి ఆలస్యం చేయకుండా వెంటనే స్పందించారు. ఆక్సిజన్‌ సహాయం లేకుండానే పోలీస్‌ డ్రెస్‌లోనే తాళ్ల సహాయంతో బావిలోకి దిగారు. అనంతరం నిచ్చెన సహాయంతో వారిద్దరిని పైకి తీసుకువచ్చారు. ఇద్దరిని 108లో ఆసుపత్రికి తరలించారు. దీనికి సంబంధించి వీడియో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతోంది. సీఐ సృజన్ రెడ్డి చూపించిన తెగువకు నెటిజన్లు ప్రశంసలతో ముంచెత్తుతున్నారు.

సంబంధిత వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి :
సీఐ ప్రాణాలకు తెగించి సాహసం..

Advertisement
 
Advertisement
Advertisement