అధికారులకు చిక్కిన చిరుత మృతి | Nehru Zoological Officers Says Leapord Died In Nalgonda | Sakshi
Sakshi News home page

అధికారులకు చిక్కిన చిరుత మృతి

May 28 2020 8:26 PM | Updated on May 28 2020 8:29 PM

Nehru Zoological Officers Says Leapord Died In Nalgonda  - Sakshi

సాక్షి, హైదరాబాద్‌/నల్గొండ : నల్గొండ జిల్లాలో అటవీ అధికారులకు చిక్కిన చిరుత మృతి చెందింది. ఈ విషయాన్ని  నెహ్రూ జూపార్కు అధికారులు స్వయంగా తెలిపారు. వివరాల్లోకి వెళితే నల్గొండ జిల్లా మర్రిగూడం మండలం రాజపేట తండా వద్ద అటవీ అధికారులు ఏర్పాటు చేసిన ఇనుప కంచెలో చిరుత చిక్కుకొంది. సమాచారం అందుకున్న అటవీ అధికారులు చిరుతకు మత్తు ఇచ్చి జీప్‌లో హైదరాబాద్‌కు తరలిస్తుండగా మార్గ మధ్యలోనే మృతి చెందింది. చిరుత కంచెలో ఇరుక్కు పోవడంతో దానికి బాగా గాయాలయి రక్తం బాగా పోయిందని వైద్యాధికారులు తెలిపారు. దీంతో పాటు ఎండలు ఎక్కువగా ఉండడంతో వేడిమికి తట్టుకోలేక చిరుత మృతి చెందినట్లుగా నిర్థారించారు. 

Advertisement
 
Advertisement
Advertisement