ఉదారవాద విధానాలతో తీవ్ర నష్టం | NDA Government trying to remove the Employment guarantee scheme | Sakshi
Sakshi News home page

ఉదారవాద విధానాలతో తీవ్ర నష్టం

Aug 1 2014 1:34 AM | Updated on Sep 2 2017 11:10 AM

ఉదారవాద విధానాలతో తీవ్ర నష్టం

ఉదారవాద విధానాలతో తీవ్ర నష్టం

దేశంలో అంతర్జాతీయ ద్రవ్యనిధి, బహుళజాతి సంస్థలు, కార్పొరేట్ శక్తుల ఆధిపత్యం మితిమీరి...ఆకలి, పేదరికం, దారిద్య్రం పెరుగుతున్నాయని ప్రముఖ ఆర్థిక వేత్త, ఢిల్లీ యూనివర్సిటీ ప్రొఫెసర్ ప్రభాత్ పట్నాయక్ అన్నారు.

* ఆర్థికవేత్త ప్రొఫెసర్ ప్రభాత్ పట్నాయక్
* హన్మకొండలో అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘం మహాసభలు

 
వరంగల్: దేశంలో అంతర్జాతీయ ద్రవ్యనిధి, బహుళజాతి సంస్థలు, కార్పొరేట్ శక్తుల ఆధిపత్యం మితిమీరి...ఆకలి, పేదరికం, దారిద్య్రం పెరుగుతున్నాయని ప్రముఖ ఆర్థిక వేత్త, ఢిల్లీ యూనివర్సిటీ ప్రొఫెసర్ ప్రభాత్ పట్నాయక్ అన్నారు. ప్రస్తుత ఆర్థిక సరళీకరణ విధానాలతో వ్యవసాయ రంగం సంక్షోభంలో చిక్కుకొని రైతులు, కూలీలు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. హన్మకొండలో గురువారం ప్రారంభమైన అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘం జాతీయ 8వ మహాసభలో ఆయన ప్రారంభోపన్యాసం చేశారు. ప్రజా ఉద్యమాల ఫలితంగా వచ్చిన ఉపాధి హామీ పథకాన్ని ఎన్డీయే ప్రభుత్వం నీరుగార్చేందుకు చేస్తున్న కుట్రలను నిలదీయాలన్నారు.
 
  కా గా, హన్మకొండలో అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘం మహాసభల ప్రారం భం సందర్భంగా సంఘం జెండాను జాతీయశాఖ అధ్యక్షుడు పాటూరు రామయ్య ఆవిష్కరించారు. మహాసభల ఆహ్వాన సంఘం చైర్మన్ జి.నాగయ్య స్వాగత ఉపన్యాసం, ప్రొఫెసర్ ప్రభాత్ పట్నాయక్ ప్రారంభోపన్యాసం చేశారు. ఈ సభల్లో సంఘం జాతీయ ప్రధాన కార్యదర్శి విజయరాఘవన్, సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యుడు బి.వి. రాఘవులు తదితరులు పాల్గొన్నారు. 29 రాష్ట్రాల నుంచి వెయ్యి మంది ప్రతినిధులు హాజరయ్యూరు. మరో రెండు రోజుల పాటు సభలు జరుగుతాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement