ప్రకృతి నుంచే పాఠం...

Nature Photos after Lockdown Before Lockdown in Medchal - Sakshi

కోవిడ్‌–19 (కరోనా) మహమ్మారి మానవాళిని కబళిస్తోంది. ఈ నేపథ్యంలో ఈ వైపరీత్యం శాశ్వతంగా ఉండదు.. ముందుంది మంచి కాలం అని ప్రకృతి మరోసారి మానవాళికి ధైర్యం చెప్పేలా ఉన్న చిత్రాలు ‘సాక్షి’ కెమెరాకు చిక్కాయి. మేడ్చల్‌ జిల్లా కుత్బుల్లాపూర్‌ నియోజకవర్గం కొంపల్లి మున్సిపల్‌ పరిధిలోని దూలపల్లి–బహదూర్‌పల్లి రహదారిలో ఈ దృశ్యాలను ‘సాక్షి’ సేకరించింది. మార్చిలో లాక్‌డౌన్‌ ప్రారంభానికి ముందు రహదారికి ఇరువైపులా ఉన్న చెట్లు ఆకులన్నీ రాలి మోడువారాయి. అవే చెట్లు ప్రస్తుతం పచ్చని ఆకులు.. ఎర్రని పూలతో కనువిందు చేస్తూ భవిష్యత్‌ అంతా పచ్చగా ఉంటుందనే సంకేతాన్నిస్తున్నాయి.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top