బాసర ట్రిపుల్‌ ఐటీకి జాతీయస్థాయి అవార్డు

National Award for Basila Triple IT - Sakshi

బాసర: బ్లాక్‌చైన్‌ సాంకేతిక పరిజ్ఞానంపై బాసర ట్రిపుల్‌ ఐటీకి జాతీయ అవార్డు వరించింది. రాజస్తాన్‌ ఎలేట్స్‌ టెక్నో ఆధ్వర్యంలో జైపూర్‌లో ఈనెల 24, 25వ తేదీల్లో జాతీయ సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా రాజస్తాన్‌ ఉన్నత విద్య కమిషన్‌ కార్యదర్శి అశుతోష్‌ ఏటిపడేకర్‌ చేతుల మీదుగా బాసర ట్రిపుల్‌ ఐటీ అకడమిక్‌ డీన్‌ సాయినాథ్‌ ఈ అవార్డు అందుకున్నారు. కార్యక్రమంలో కేంద్ర మానవ వనరులశాఖ మంత్రి ప్రకాశ్‌ జవదేకర్, మణిపూర్, ఉత్తరాఖండ్, రాజస్తాన్‌ విద్యాశాఖ మంత్రులు, ఏఐసీటీఈ, వివిధ కంపెనీల ప్రతినిధులు పాల్గొన్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top