తెలంగాణావాసికి శాంతి స్వరూప్‌ పురస్కారం | Naresh patwari receive Shanti Swarup Bhatnagar Prize | Sakshi
Sakshi News home page

తెలంగాణావాసికి శాంతి స్వరూప్‌ పురస్కారం

Sep 29 2017 11:14 AM | Updated on Sep 29 2017 11:16 AM

హైదరాబాద్‌ సిటీ:
నిజామాబాద్‌ జిల్లా బోధన్‌కు చెందిన నరేశ్‌ పట్వారీకి ప్రతిష్టాత్మక శాంతి స్వరూప్‌ భట్నాగర్‌ పురస్కారం లభించింది. కౌన్సిల్‌ ఆఫ్‌ సైంటిఫిక్‌ అండ్‌ ఇండస్ట్రియల్‌ రీసెర్చ్‌ సంస్థ శుక్రవారం ఈ పురస్కారాన్ని ప్రకటించింది. నరేశ్‌ పట్వారీ ప్రస్తుతం ఐఐటీ ముంబైలో ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నారు. ఆయనకు పతకంతో పాటు రూ.5లక్షల నగదు అందజేస్తారు. 65 ఏళ్ల వయసు వచ్చేంత వరకు ప్రతి నెలా రూ.15 వేల నగదు అందజేస్తారు.
 

Advertisement
 
Advertisement
Advertisement