ఐదారు వేల జీతానికే వెట్టి చాకిరి..

సాక్షి, హైదరాబాద్‌: నారాయణ విద్యాసంస్థలో పనిచేసే జూనియర్‌ లెక్చరర్లు ఆందోలనకు దిగిన విషయం తెలిసేందే. కనీసం వేతనం రూ. 18 వేలు ఇవ్వాలని యజమాన్యాన్ని కోరారు. గత 21 రోజులుగా ఈ ఆందోళనలు కొనసాగుతున్నాయి. నగరంలోని దిల్‌సుఖ్‌నగర్‌, పుల్లారెడ్డి బ్రాంచ్‌లలో జూనియర్‌ లెక్చర​ర్లు మహా ధర్నాకు దిగారు.

ఐదారు వేల జీతానికే తమతో వెట్టిచాకిరి చేయించుకుంటున్నారని వారు మండిపడ్డారు. తాము పడుతున్న కష్టాన్ని చూసైనా యజమాన్యం కనీస వేతనాలు చెల్లించాలని డిమాండ్‌ చేశారు. అంతేకాక ప్రస్తుతం పనివేళలు అధికంగా ఉన్నాయని.. వాటిని 8 గంటలకు అమలు చేయాలని జూనియర్‌ లెక్చరర్లు ధర్నా చేస్తున్నారు. 
 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top