నలమాస కృష్ణను కోర్టులో హాజరు పరిచిన ఎన్‌ఐఏ

 Nallamasa Krishna Was Presented On Nampally Court By NIA - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ ప్రజాఫ్రంట్ ఉపాధ్యక్షుడు నలమాస కృష్ణను అరెస్టు చేసిన జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) గురువారం నాంపల్లి కోర్టులో న్యాయమూర్తి ముందు హాజరుపరిచింది. విచారణ అనంతరం 14 రోజుల జ్యుడిషియల్ రీమాండ్‌పై నలమాస కృష్ణను చర్లపల్లి జైలుకు ఎన్‌ఐఏ తరలించింది. (తెలుగు రాష్ట్రాల ప్రజలకు గుడ్‌న్యూస్‌)

మావోయిస్టులతో సంబంధాలు ఉన్నాయన్న ఆరోపణల కేసులో ఎన్‌ఐఏ అరెస్టు చేసింది. గత ఆదివారం ఖమ్మంలో కృష్ణను ఎన్‌ఐఏ అదుపులోకి తీసుకున్నారు. గతంలో పలు కేసుల్లో నిందితుడిగా ఉన్న కృష్ణ 8 నెలల పాటు జైలు జీవితం గడిపి ఇటీవల బెయిల్‌పై బయటకు వచ్చారు. అనారోగ్యం కారణంగా ఖమ్మంలోని కిమ్స్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతుండగా ఎన్‌ఐఏ అధికారులు ఆయనను అరెస్టు చేశారు. అనంతరం ఖమ్మం కోర్టులో ప్రవేశ పెట్టి పిటి వారెంట్‌పై హైదరాబాద్‌కు తరలించారు. (సరిహద్దు వివాదం: ముగిసిన చర్చలు )

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top