ముఖ్యమంత్రి కేసీఆర్ తనకు నచ్చినట్లు చెప్పుకుంటున్నారనీ బీజేపీ నేత నాగం జనార్దన్ రెడ్డి అన్నారు.
సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. ఒక్క గజం భూమి, ఒక్క పైసా పోలేదని ముఖ్యమంత్రి నిర్ధారణకు ఎలా వచ్చారని ప్రశ్నించారు. ఈ కేసుతో సంబంధం ఉన్న గోల్డ్‌స్టోన్ ప్రసాద్‌ను ఇంకా ఎందుకు అరెస్ట్ చేయలేకపోతున్నారని నిలదీశారు. ఈ కేసులో సీబీఐ విచారణకు ఆదేశించాలని ఎంత ఒత్తిడి చేసినా నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని దుయ్యబట్టారు.