4న మున్సిపల్‌ ఎన్నికల నోటిఫికేషన్‌! | Muncipal Notification Will Release By November 4th In Telangana | Sakshi
Sakshi News home page

నవంబర్‌ 4న మున్సిపల్‌ ఎన్నికల నోటిఫికేషన్‌ !

Nov 1 2019 2:09 PM | Updated on Nov 1 2019 2:27 PM

Muncipal Notification Will Release By November 4th In Telangana - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : తెలంగాణలో జరగనున్న మున్సిపల్‌ ఎన్నికలకు సంబంధించి రాష్ట్ర ఎన్నికల సంఘం కసరత్తు పూర్తి చేసింది. దీనికి సంబంధించి ఈ నెల 4న ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదలయ్యే అవకాశం ఉంది. తాజాగా నిర్వహించనున్న మున్సిపల్‌ ఎన్నికలు రెండు దశల్లో జరగనున్నాయి. మొదట కోర్టు సమస్యలు లేని మున్సిపాలిటీలకు మొదటి దశలో ఎన్నికలు నిర్వహించనుండగా, తర్వాతి దశలో మిగతావాటికి నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో మున్సిపాలిటీ చైర్మన్‌, వార్డులకు సంబంధించిన రిజర్వేషన్ల కసరత్తు ప్రక్రియను తెలంగాణ ప్రభుత్వం పూర్తి చేసింది. ఎన్నికల నోటిఫికేషన్‌ వెలువడగానే మున్సిపల్‌ శాఖ వార్డుల రిజర్వేషన్లకు సంబంధించిన డ్రాను తీయనుంది.  
 

Advertisement
 
Advertisement
Advertisement