కొనసాగుతున్న మొహర్రం ఊరేగింపు

Muharram Rally Begins In Old City Hyderabad - Sakshi

సీసీ కెమెరాలతో పూర్తిస్థాయి భద్రతా ఏర్పాట్లు

సాక్షి, హైదరాబాద్‌: పాతబస్తీలోని ప్రసిద్ధ బీబీకా ఆలం నుంచి ప్రారంభమయిన మొహ​ర్రం ఊరేగింపు కొనసాగుతోంది. డబిల్‌ పుర నుంచి చార్మినార్‌ వరుకు జరిగే ర్యాలీ సందర్భంగా పోలీసుశాఖ  పకడ్బందీ చర్యలు చేపట్టింది. భారీగా పోలీసులను మోహరించారు. పూర్తిస్థాయి భద్రతకు సీసీ కెమెరాలు కూడా ఏర్పాటు చేశామని సీపీ అంజనికుమార్‌ తెలిపారు. ఈ ర్యాలీ సాయంత్రం ఏడు గంటలకు జరుగుతుందని పేర్కొన్నారు. నగరంలో నేడు కూడా గణేష్‌ నిమజ్జనాలు జరుగుతున్నాయని.. జీహెచ్‌ఎంసీ ఆధ్వర్యంలో అన్ని రోడ్లకు మరమ్మతులు పూర్తి చేశామని వెల్లడించారు. గణేష్‌ నిమజ్జనాల సమయంలో ప్రజలందరూ పోలీసులకు సహకరించాలని కోరారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top