గ్రీన్‌చాలెంజ్‌ను స్వీకరించిన ఎంపీ సంతోష్‌కుమార్‌

MP Santhosh Kumar accepted green challenge - Sakshi

మూడు మొక్కలునాటి ట్విట్టర్‌లో పోస్టింగ్‌

ఉపరాష్ట్రపతి వెంకయ్య, గవర్నర్‌ నరసింహన్, హీరో నాగార్జునలకు గ్రీన్‌చాలెంజ్‌

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్ర హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి విసిరిన గ్రీన్‌చాలెంజ్‌ను రాజ్యసభ సభ్యుడు జోగినపల్లి సంతోష్‌ కుమార్‌ స్వీకరించారు. ఆదివారం ప్రగతిభవన్‌లో ఆయన మూడు మొక్కలను నాటారు. మొక్కలు నాటి, నీళ్లు పోస్తున్న ఫొటోలను ఆయన తన ట్విట్టర్‌ అకౌంట్‌లో పోస్ట్‌ చేశారు.

మొక్కలను నాటడమే కాకుండా వాటి సంరక్షణకు చర్యలు చేపడతానని ఆయన ట్వీట్‌ చేశారు. రాజ్యసభ చైర్మన్, ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, గవర్నర్‌ నరసింహన్, హీరో అక్కినేని నాగార్జునకు గ్రీన్‌చాలెంజ్‌ను విసిరి తన చాలెంజ్‌ స్వీకరించాలని కోరారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter

Tags: 
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top