
పునర్నిర్మాణ బోర్డు పనిచేస్తోందా?
పారిశ్రామిక, ఆర్థిక పునర్నిర్మాణ బోర్డులో ఖాళీ లు ఎక్కువగా ఉన్నాయి.. పోస్టులు భర్తీ చేయడం లేదు..
పార్లమెంట్‌లో ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రశ్న
ఖమ్మం: పారిశ్రామిక, ఆర్థిక పునర్నిర్మాణ బోర్డులో ఖాళీ లు ఎక్కువగా ఉన్నాయి.. పోస్టులు భర్తీ చేయడం లేదు.. అసలు ఈ బోర్డు పనిచేస్త్తోందా? లేదా? అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ అధ్యక్షుడు, ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి శుక్రవారం పార్లమెంట్‌లో ప్రశ్నించారు. పారిశ్రామిక, ఆర్థిక పునర్నిర్మాణ బోర్డులో పెండింగ్ కేసులు పరిష్కరించుకోవడానికి నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ కమిటీ ఏర్పాటుకు ప్రభుత్వం ప్రతిపాదనలు చేస్తుందా..? దాని వివరాలు తెలపాలని ఎంపీ అడిగారు.
ఈ అంశంపై కేంద్ర ఆర్థిక మంత్రి జస్వంత్‌సిన్హా సమాధానమిచ్చారు. ప్రస్తుత పారిశ్రామిక, ఆర్థిక పునర్నిర్మాణ బోర్డులో చైర్మన్, ఇద్దరు సభ్యులను భర్తీ చేశామన్నారు. జనవరి, మార్చిల్లో చైర్మన్, ఒక సభ్యుడిని నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశామని చెప్పారు. కంపెనీస్ యాక్ట్ చట్టం 2013 ప్రకారం నేషనల్ లా ట్రిబ్యునల్ కంపెనీ ఏర్పాటు చేశారని, కంపెనీ చట్టం 2013లోని సెక్షన్ 434 ప్రకారం విచారణలో ఉన్న కేసులు తగ్గినందున ఆ పెం డింగ్ కేసులను జాతీయ కంపెనీల లా ట్రిబ్యునల్‌కు ప్రస్తావించవచ్చునన్నారు. ఆ ట్రిబ్యునల్స్ ఏర్పాటుకు దశలవారీ చర్యలు తీసుకుంటున్నామని, వచ్చే ఆర్థిక సంవత్సరంలో ఆ సంస్థలు పనిచేసేందుకు చర్యలు తీసుకుంటామన్నారు.